Kadiyam Srihari : కవితపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!

live-updates-breaking-news-20092025

Kadiyam Srihari :  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ కు రాజీనామా విషయంలో ఇన్ని రోజులు నోరు మెదపని కడియం ఇప్పుడు నోరు విప్పారు.

అయితే.. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవ్వడం వల్లే తాను రాజీనామా చేశానని కడియం వెల్లడించారు. కవిత అరెస్ట్ అవడంతో పార్టీకి చెడ్డపేరు వచ్చిందని అందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు.

అయితే.. గతంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పిన కడియం.. ఇప్పుడు కవిత వల్లే రాజీనామా చేశానని మాట మార్చారు.

Read Also : ఎదురింటోడితో లేచిపోయిన తోటికోడళ్లు.! చివర్లో అసలు ట్విస్ట్..!

గతంలో అయితే.. అసలు తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా చెప్పేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయాన్ని ఒప్పుకున్నారు.

ఎలాగూ పదవి పోతుందనే ఉద్దేశంతోనే ఈ మాట చెప్పారనే చర్చ జరుగుతోంది.

..