Jubileehills Fake votes: జూబ్లీహిల్స్ లో సంచలనం.. భారీగా దొంగ ఓట్లు..!

BREAKING NEWS-13-BATUKAMMA.COM

Jubileehills Fake votes: ఓట్ చోరీ అంటూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ.. బీజేపీపై పోరాటం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో దొంగ ఓట్లు (Fake votes) ఉన్నాయని ఆయన వరుస ప్రెస్ మీట్ లు పెట్టారు.

కానీ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలోనే భారీ ఓట్ల చోరీ బయటపడింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇది బట్టబయలైంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్ గూడాలో పెద్ద సంఖ్యలో ఓట్లు బయటపడ్డాయి. బూత్ నంబర్ 246లో ఒకే ఇంట్లో, ఒకటే ఇంటి నంబర్ తో 43 ఓటరు కార్డులు(Jubileehills Fake votes) బయటపడ్డాయి.

అది కూడా నిర్మాణంలో ఉన్న భవనం అని బీఆర్ఎస్ అంటోంది. అలాంటి ఇంట్లో 43 ఓట్లు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తోంది.

jubileehills fake voters 1

jubileehills fake voters 3

jubileehills fake voters 2

jubileehills fake voters 1

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఓటర్ల సంఖ్యను సరిచూసుకుంటోంది. ఓటర్ల సంఖ్య, వారు అక్కడ ఉంటున్నారా.? లేదా అనే వివరాలు ప్రచారం సందర్భంగా తెలుసుకుంటోంది.

దీంతో ఈ ఓట్ చోరీ బయటపడింది. ఒక బూత్ లో ఒక ఇంట్లోనే 43 ఓట్లు బయటపడ్డాయంటే.. నియోజకవర్గంలోని ఇతర డివిజన్లలో ఇంకెన్ని నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయోనని బీఆర్ఎస్ పార్టీ అంటోంది.

..

Read Also :