Jagruthi Kavitha : ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత, జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొద్దిరోజులుగా తన లేఖలు, వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో కవిత అలజడి రేపుతున్నారు. మరీ ముఖ్యంగా తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు ఇస్తున్నారు.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉండే సంతోష్ రావు, హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
ఇదే సమయంలో ఆమె మరో సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె(Jagruthi Kavitha) ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
“తనకు కాంగ్రెస్, బీజేపీ ఎంతో.. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతేనంటూ…” ఆమె వ్యాఖ్యానించారు. అంటే బీఆర్ఎస్ (brs)కూడా తనకు ప్రత్యర్థి పార్టీనే అని ఆమె సంకేతాలు ఇచ్చారు.
BRS పార్టీపై కేసీఆర్ కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు..
వీడియో సోర్స్ : న్యూస్ 18 pic.twitter.com/m0jmjvDNd0
— PV NEWS (@pvnewstelugu) October 5, 2025
తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే చెప్పారు. కవిత లేఖ, వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాక.. ఫ్యామిలీలో కూడా దూరం పెరిగింది.
ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ కూడా తనకు ప్రత్యర్థి పార్టీనే ప్రకటించడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి.
అయితే.. కవిత ఎందుకు తన తండ్రి పార్టీనే టార్గెట్ చేస్తోందనేది అంతుపట్టడం లేదు. తన తండ్రికి అండగా ఉంటానంటూ ఆమె రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు.
కానీ ఆమె చేస్తున్న పనులు.. మాటలన్నీ కూడా.. తన తండ్రి కేసీఆర్(kcr) స్థాపించిన బీఆర్ఎస్ ను దెబ్బతీసే విధంగానే ఉంటున్నాయి. దీంతో అసలు కవిత సొంతగానే ఇదంతా చేస్తున్నారా.?
లేకపోతే అప్పట్లో షర్మిల వెనక కాంగ్రెస్ ఉండి నడిపించినట్టు.. కవిత వెనక ఎవరైనా ఉన్నారా అనే చర్చ మరింత ఎక్కువగా జరుగుతోంది.
బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీలోని నాయకులపై ఏ వ్యాఖ్యలు చేసినా.. అది తన తండ్రికే డ్యామేజ్ చేస్తుందని తెలిసి కూడా ఆమె ఎందుకు ఇలా చేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు.
Read Also :.

