ICGTPF 4.0 : నాలుగో అంతర్జాతీయ గ్రీన్ టెక్నాలజీ పాలసీ అండ్ ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు చంద్రదీప్ సోలార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు ప్రకటించారు.
తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలోని కేఎల్ఎన్ ఆడిటోరియంలో డిసెంబర్ 5న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు.
సుస్థిర సాంకేతికత, ఇన్నోవేటీవ్ ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్టు సంస్థ అధినేత చంద్రదీప్ తెలిపారు.
అంతర్జాతీయంగా పరస్పరసహకారం పెంపొందిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో.. ఆ రంగంలో ఆవిష్కరణలు, కొత్త పాలసీల రూపకల్పన, ఆర్థిక సహకారం వంటి అంశాలపై అంతర్జాతీయ వారధిగా ఈ సదస్సు ఉండబోతోందని తెలిపారు.
అలాగే.. గ్రీన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల ప్రోత్సాహం దిశగా ICGTPF 4.0 ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
పారిశ్రామిక కర్బన ఉద్గారాలు తగ్గించడం, ఫొటోవోలటైల్ సోలార్ తొ పాటు.. అగ్రి వొలాటిక్స్, ఫ్లోటింగ్ సోలార్ ను పెంచే దిశగా ఇందులో చర్చిస్తామన్నారు.

పర్యావరణ పరిరక్షణ రంగంలో పెట్టుబడులను పెంచడం, గ్రిడ్ ఆధునీకరణ, ఎనర్జీ స్టోరేజ్ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడే దిశగా చర్యలు ఉండాలన్నారు. అలాగే ఈ మొబిలిటీని మరింత పెంచే దిశగా ఈ సదస్సులో చర్చించబోతున్నామని వివరించారు.
కర్బన ఉద్ఘారాలు తగ్గించే దిశగా అంతర్జాతీయ సమాజాన్ని సమాయత్తం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ సదస్సులో యూకే, జర్మనీ, కొరియా, నెదర్లాండ్స్, ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు పాల్గొంటారు. ప్రభత్వ ప్రతినిధులు కూడా పాల్గొంటారని తెలిపారు.
అలాగే.. ICGTPF 4.0 చైర్మన్ అజయ్ మిశ్రా, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, , తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హా పాల్గొననున్నారు
దీనికోసం ఈ నెల 17న తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్ )లో ప్రీ కాన్ఫరెన్స్ సెషన్ నిర్వహించనునట్టు తెలిపారు. సదస్సుపై మరింత సమచారం కోసం 9330280381/9032506613 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
..
Read Also :

