Revanth reddy : హైదరాబాద్ శివారులో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth reddy) పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ కార్యాలయ భవనానికి, రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
తనకు పదేళ్లు అధికారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. న్యూయార్క్, టోక్యోను తలదన్నేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తానని చెప్పారు. తానే వచ్చి ఫ్యూచర్ సిటీలో(future city) కూర్చుంటానని తెలిపారు. న్యూయార్క్ లో ఉన్నవాళ్లు కూడా..తాము భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లి వచ్చామని గొప్పగా చెప్పుకునేలా చేస్తానని అన్నారు.
తాను సెక్రటేరియట్ లో కూర్చోబోనని.. ఫ్యూచర్ సిటీ ఆఫీసులోనే కూర్చుంటానని తెలిపారు. అప్పుడే ప్రపంచదేశాలన్నీ ఇక్కడికి క్యూ కడతాయని అన్నారు. ఈ సిటీ ఇప్పుడు బతికి ఉన్నవాళ్ల కోసం కాదన్న ఆయన.. భవిష్యత్ తరాల కోసమేనని చెప్పారు.
ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ రైలు తీసుకొస్తానని చెప్పారు. ఫ్యూచర్ సిటీ మీదుగానే అమరావతికి బుల్లెట్ రైలు వెళుతుందని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ పరిధిలోని గ్రామాల ప్రజలు, రైతులు అనవసరంగా కోర్టులకు వెళ్లొద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కోర్టులకు వెళితే డబ్బులు వృథా తప్ప ఉపయోగం ఉండబోదన్నారు. తానే వచ్చి కూర్చుని సమస్యలు పరిష్కరిస్తానని మంచి పరిహారం ఇప్పిస్తానని తెలిపారు.
తాను రైతును మాత్రమే కాదని.. భూముల వ్యాపారం కూడా చేశానని.. తనకు భూముల విలువ తెలుసునని చెప్పారు. అందుకే ఎవరికీ నష్టం కలగకుండా చూస్తానని వివరించారు.
Read Also :

