Raghunandan Rao : మీడియాకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్..!

bjp mp raghunandan rao warning to media

Raghunandan Rao : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. మీడియాపై రెచ్చిపోయారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా యాజమాన్యాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

తమకు మీడియాలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. తమ వార్తలు టీవీల్లో, పేపర్లలో రావడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పార్టీ మూడు సార్లు దేశాన్ని పాలిస్తోందని.. రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు గెలిచిందని అన్నారు.

అలాంటి పార్టీకి మీడియాలో ప్రాధాన్యత దక్కకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ వార్తలు కూడా ప్రచురించాలని, ప్రసారం చేయాలని కోరారు.

ఇక సర్వేల పేరుతో కొన్నిడిజిటల్ మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

జూబ్లీహిల్స్ లో తమ పార్టీకి వ్యతిరేకంగా సర్వే రిపోర్టులు తయారుచేస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

ఇప్పుడు తమకు అధికారం లేకపోయినా.. వచ్చిన రోజు మాత్రం.. తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

అన్ని ఛానళ్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రఘునందన్  రావు(Raghunandan Rao) అన్నారు.

Read Also :