BIG BREAKING NEWS : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
బీసీల రిజర్వేషన్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయం సమస్యాత్మకంగా మారింది. దీనిపై ఇప్పటికే పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఈ నెల8న మరోసారి వాదనలు విననుంది.
మరోవైపు.. 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 42 శాతం రిజర్వేషన్లు ఆపేయాలని కోరారు. దీనిపై రేపు విచారణ జరగనుంది
మరోవైపు అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లుకు కూడా గవర్నర్ ఆమోదం లభించలేదు.
మొత్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. దీంతో సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ 42 శాతం రిజర్వేషన్లకు ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రతిపక్షాలే కారణమని నెపం వారి మీద వేసి.. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంటే పాత లెక్క ప్రకారం బీసీలకు 23 శాతం రిజర్వేషన్ మాత్రమే రానుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు వచ్చాక ఈ నిర్ణయాన్ని సర్కారు వెల్లడించే అవకాశం ఉంది.
..
Read Also :.

