Bandi Sanjay : కేంద్రమంత్రి బండి సంజయ్ చర్లపల్లి జైలును సందర్శించారు. ఖైదీల సంక్షేమంలో దేశంలోనే
నంబర్ వన్ గా నిలిచిందని ఆయన అన్నారు. ఖైదీలకు బీమా, కుటుంబసభ్యులకు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు.
ఖైదీల తయారుచేస్తున్న ఉత్పత్తులతో ప్రత్యేక మేళా నిర్వహించాలని జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రాకు సూచించారు. దీనికి కేంద్రం నుండి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
జైలు ఆవరణలో బండి సంజయ్ (Bandi Sanjay )కలియతిరిగారు. ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీలను, వారు తయారు చేస్తున్నఉత్పత్తులను అడిగి తెలుసుకున్నారు. గోశాలను సందర్శించారు. గోవులకు స్వయంగా తన చేతితో మేత తిన్పించారు. ఒక లేగ ఆవుకు ‘క్రిష్ణ’ అంటూ నామకరణం చేశారు.


జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ క్లబ్, బంతి పూల వనాన్ని సందర్శించారు. తేనె టీగలతో తేనె ఏ విధంగా పడుతున్నారనే విషయాన్ని స్వయంగా తిలకించారు.
అనంతరం ఖైదీల కోసం జైళ్ల శాఖ చేపట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

సౌమ్య మిశ్రా జైళ్ల శాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఖైదీల కుటుంబ సభ్యులకు వీడియో లింక్ ద్వారా ఎక్కడినుండైనా ములాఖాత్ అయ్యే అవకాశం కల్పించినట్టు వివరించారు.
ఖైదీలు చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించామన్నారు. ఖైదీల ఆరోగ్యం కోసం డాక్టర్లు నియమించినట్టు చెప్పారు. ఖైదీలకు వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నామని.. పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు కల్పించామన్నారు.
Also Read :

