NHPC : నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC) 248 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో అసిస్టెంట్ రాజ్‌భాష ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ (JE), సీనియర్ అకౌంటెంట్, సూపర్‌వైజర్ (IT), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వయసు 30 ఏళ్లకు మించకూడదు. పోస్టులను బట్టి డిగ్రీ, బీ.టెక్ లేదా సీఏ అర్హత అవసరం. ఎంపికైన వారికి నెలకు రూ.27,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం లభిస్తుంది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అభ్యర్థులు వచ్చే నెల 1లోగా nhpcindia.com వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

