Lakshita Chaudhary : మధ్యప్రదేశ్ లో(Madhya Pradesh) దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు తీశాడు భాయ్ ఫ్రెండ్. మర్డర్ కూడా సాధారణంగా చేస్తే ఎలా అనుకున్నాడో ఏమో.. ఒళ్లు గగుర్పొడిచేలా చేశాడు.
మధ్యప్రదేశ్ లోన దేవాస్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల లక్షిత చౌదరికి(Lakshita Chaudhary), 35 ఏళ్ల మనోజ్ చౌహాన్ (Manoj Chauhan)అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. చాలాకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.
సెప్టెంబర్ 28 సోమవారం రోజున.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి లక్షిత చౌదరి ఇంటి నుండి వెళ్లింది. కాలేజీలో గార్బా ఈవెంట్ ఉందని.. గార్బా డ్రెస్ లోనే వెళ్లింది.
కాలేజీకని వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగి రాలేదు దీంతో ఆమె కుటుంబసభ్యులు మూడు రోజుల పాటు వెతికి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం ఇంటి నుండి బయటకు వెళ్లిన లక్షిత నేరుగా మనోజ్ చౌహాన్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమెను హత్య చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి నీళ్లున్న డ్రమ్ములో(blue drum) వేసి మూతపెట్టాడు.

దీంతో ఊపిరాడక యువతి చనిపోయింది.
ఆ తర్వాత రెండు మూడు రోజులు సైలెంట్ గా ఉన్న మనోజ్ చౌహాన్.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోవడంతో విషయం బయటకు వచ్చింది.
అయితే.. తానే లక్షితను ఇంటికి పిలిచానని మనోజ్ ఒప్పుకున్నాడు. ఆమె తనను ప్రేమిస్తూనే.. మరో యువకుడితో కూడా తిరుగుతోందని చెప్పాడు.

బాడీనీ మూడు రోజుల పాటు డ్రమ్ములోనే వదిలేయడంతో వైశాలి అవెన్యూ కాలనీలో(Vaishali Avenue Colony) దుర్వాసన వచ్చింది. దీంతో వారు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ విషయంలో మందలించడంతో తనపైనే తిరగబడిందని.. ఆ కోపంలోనే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. మనోజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపించారు.
..
Read Also :.

