Husband wife : ఈ మధ్యకాలంలో పెళ్లైన తర్వాత అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్నాయి. పెళ్లై.. భర్త,పిల్లలు ఉండగా వేరే మహిళలో సంసారం పెడుతున్న వారి గురించి ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం.
మరికొందరైతే ప్రియుడి కోసం భర్తలను ఖతం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇలాంటి ఘటనలు చాలా పెరిగిపోయాయి. మేఘాలయ ఘటన నుండి నిన్న మొన్నటివరకు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. నేటికి జరుగుతూనే ఉన్నాయి.
అయితే బంగ్లాదేశ్ లోని మున్షిగంజ్ లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
ఓ వ్యక్తికి ఓ మహిళతో వివాహం(Husband wife) జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆమెకు భర్త కంటే ప్రియుడిపైనే ఎక్కువ మోజు కలిగింది.
భర్తతో ఉండలేకపోయింది. ఓ మంచి రోజు చూసుకుని పిల్లలను వదిలేసి, మొగుడిని వదిలేసి ప్రియుడితో జంప్ అయ్యింది.
అయితే.. భార్య తన ప్రియుడితో వెళ్లిపోయిందని ఆ భర్త ఆందోళన పడలేదు.
ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లిపోయిన భార్యకంటే అందమైన అమ్మాయిని చూసుకున్నాడు.

చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. ఎంత గ్రాండ్ గా అంటే.. పెళ్లి కూతురిని తన ఇంటికి హెలికాప్టర్ లో తెచ్చుకున్నాడు.
పెళ్లికూతురు ఇంటి నుండి.. తన ఇంటికి రావడానికి ఓ హెలికాప్టర్ బుక్ చేసి.. అందులో తన రెండో భార్యను తెచ్చుకున్నాడు.

తన రెండో పెళ్లి గురించి ప్రపంచమంతా తెలిసేలా చేశాడు. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. తన మొదటి భార్యకు ఇది చూసి బుద్ధి రావాలని అంటున్నాడు. మొదటి భార్య చేసిన తప్పేంటో తెలిసి రావాలనే.. ఇలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.
..
..
Read Also :

