Abhishek singhvi : తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం చాలా కాంట్రవర్సీగా మారింది. రిజర్వేషన్లపై కొందరు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయారు. సుప్రీంకోర్టు ఈ కేసును టేకప్ చేయలేదు. దీంతో హైకోర్టులోనే హియరింగ్ నడుస్తోంది.
ఈ కేసు హైకోర్టులో మొదట హియరింగ్ కు వచ్చిన రోజు అడ్వకేట్ జనరల్ వాదనలు విపిపించారు. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యాక ఈ కేసులోకి అభిషేక్ మను సింఘ్వీ ఎంటర్ అయ్యారు.
అలాగే.. హైకోర్టులో నిన్న(అక్టోబర్ 8న) కూడా ఆయనే వాదనలు వినిపించారు. ఇవాళ కూడా ఆయన కోర్టు హియరింగ్ కు హాజరుకాబోతున్నారు.
ఈ ఒక్క కేసే కాదు.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ కేసు వచ్చినా ఆయనే టేకప్ చేస్తారు. అందుకే కావొచ్చు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన రాష్ట్రంతో సంబంధం లేకపోయినా.. సింఘ్వీని(Abhishek manu singhvi) ఇక్కడి నుండి రాజ్యసభకు పంపించారు.

అలాగే.. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన చాలా కేసులు కూడా ఈయనే వాదిస్తున్నారు. మరి అభిషేక్ సింఘ్వీ ఈ కేసులన్నీ ఫ్రీ గా వాధిస్తున్నారా అంటే.. అస్సలే కాదు. ఆయనకు ఖచ్చితంగా ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది.
ఎందుకంటే ఆయన దేశంలోనే టాప్ లాయర్లలో ఒకరు. అంతేకాదు.. కాస్ట్ లీ లాయర్లలో కూడా ఒకరు. కాబట్టి తన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు కాబట్టి.. ఖచ్చితంగా ఆయనకు పెద్ద మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
భారతదేశంలోనే అత్యంత ఎక్కువ లాయర్ ఫీజు తీసుకునే న్యాయవాదుల్లో ఈయన కూడా ఒకరు. దేశంలో చాలా కీలకమైన కేసులు వాధించారు. 2జీ స్పెక్ట్రం కేసు, శబరిమల కేసు, నేషనల్ హెరాల్డ్ కేసుతో పాటు.. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సంజయ్ సింగ్ బెయిల్ కేసులను ఈయనే వాధించారు. ఇంకా అనేక కీలక కేసులు వాదించారు.
పార్టీలకతీతంగా కేసులు టేకప్ చేసి వాదనలు వినిపిస్తారు. చాలా చిన్న వయసులో 34ఏళ్లకే లాయర్ అయ్యారు. 37 ఏళ్ల వయస్సులో భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్‌గా (ASG) పనిచేశారు.

రాజ్యాంగంపై, న్యాయచట్టాలపై ఆయనకు మంచి పట్టున్నది. సుప్రీంకోర్టు లాయర్ గా ఉన్న ఆయన.. రాష్ట్రాల హైకోర్టుల్లో, ట్రిబ్యునల్లలో వాదనలు వినిపిస్తారు. ఒకప్పుడు రాంజెఠ్మలానీ ఎలాగో.. ఇప్పుడు సింఘ్వీ కూడా అలాగే అని కొందరు అంటుంటారు.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీలో ఆయన ముఖ్యనేతగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు.
AICC హ్యూమన్ రైట్స్ విభాగానికి చైర్మన్ గా ఉన్నారు.
మరి ఇంత చరిత్ర ఉన్న అభిషేక్ సింఘ్వీ తక్కువ ఫీజు ఎలా తీసుకుంటాడు. అసలే దేశంలో కాస్ట్ లీ లాయర్లలో ఒకరు. అందుకే ఈయనకు ఒక హియరింగ్ కు తక్కువలో తక్కువ రూ.25 లక్షలు తీసుకుంటారని సమాచారం. ఇవి కాకుండా.. వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే రవాణా ఖర్చులు, ఫైవ్ స్టార్ హోటల్ లో వసతి వంటివి కూడా క్లయింట్ భరించాల్సి ఉంటుంది.
అంటే ఒక్కో కేసు హియరింగ్ మీద ఎంత లేదన్నా రూ.30 లక్షల వరకు వస్తుందన్నమాట. ఒక్క రోజులో చాలా కేసుల హియరింగ్ కు లాయర్లు హాజరవుతుంటారు. ఉదాహరణకు ఒక రోజులో నాలుగు కేసుల హియరింగ్ కు హాజరయ్యారని అనుకుందాం. అంటే రూ.25 లక్షల చొప్పున లెక్కిస్తే.. ఒక్కరోజులోనే కోటి రూపాయలు వస్తాయి.

అది కూడా కేసు తీవ్రతను బట్టి, హియరింగ్ కు హాజరయ్యే సమయాన్ని బట్టి ఉంటుందని చెబుతారు. ఎక్కువ సేపు కోర్టులో ఉండాల్సి వస్తే దానికి మరింత ఎక్కువ చార్జ్ చేస్తారని అంటున్నారు.
నిన్న హైకోర్టులో చాలా సేపు అంటే.. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కోర్టు హియరింగ్ లో పాల్గొన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుండి బీసీ రిజర్వేషన్ కేసుకు సంబంధించి ఆయనకు భారీ మొత్తంలోనే ఫీజు చెల్లించే అవకాశముంది.
తెలంగాణ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉండి.. తెలంగాణ ప్రభుత్వం నుండి లాయర్ ఫీజు తీసుకుని కేసులు వాదించడం విశేషం.
Read Also :

