Actress Kasturi : తమిళ సినీ నటుడు విజయ్ దళపతి (vijay thalapathy) రాజకీయ రంగప్రవేశంలో వరుస సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. మధురైలో ఆయన నిర్వహించిన సమావేశానికి దాదాపు 4 లక్షల మంది హాజరయ్యారు.
జన ప్రభంజనం చూసి ప్రత్యర్థి పార్టీల నేతలు బిత్తరపోయారు.
అయితే ఇదే సందర్భంలో నటి కస్తూరి(Actress Kasturi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన ట్విట్టర్ (X) ఖాతాలో కస్తూరి ఇలా వ్యాఖ్యానించారు..
👉 “அப்பாவுக்கு வெச்சாரு பாரு பெரிய ஆப்பா! இனிமே ஸ்டாலின் அங்கிள் Worst Uncle கோஷம்தான்! திமுகவை ஓங்கி அடிச்சவரு, பாஜகவை ஓரமா கடிச்சவரு, MGR பாட்ட பாடி செய்வீர்களா செய்வீர்களா என்கிறார். பாஜகவை விட்டு எங்க பக்கம் வாங்கன்னு அதிமுகவுக்கு ஓபன் அழைப்பு வச்சுருக்காரு வேற…”
తెలుగులో దీని అర్థం…
“తన తండ్రిని ఇబ్బంది పెట్టాడు, పెద్ద ఇబ్బంది తెచ్చుకున్నాడు! ఇకపై ‘స్టాలిన్ అంకుల్ – వర్స్ట్ అంకుల్’ అనే నినాదమే వినిపించబోతోంది. గతంలో డీఎంకేను తీవ్రంగా విమర్శించిన, బీజేపీని పక్కన పెట్టిన వ్యక్తి… ఇప్పుడు మాత్రం ఎంజీఆర్ పాటలు పాడుతూ ‘చేస్తారా చేస్తారా’ అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీని వదిలేసి మనవద్దకి రండి అని ఏఐఏడీఎంకేకు ఓపెన్ ఆహ్వానం కూడా ఇచ్చేశారు.”
- ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే – ఎఐఏడీఎంకే పార్టీలు ప్రధాన శక్తులుగా ఉన్నాయి.
- అధికారంలో ఉన్న ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- ప్రతిపక్షంగా ఉన్న ఎఐఏడీఎంకే అంతర్గత కలహాలతో బలహీనంగా కనిపిస్తోంది.
- ఇక, కేంద్రంలో ఉన్న బీజేపీ తమిళనాడులో తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ పెద్ద స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది.
Read Also : మార్వాడీలకు రోహింగ్యాలకు లింక్ ఏంటీ..?
ఈ నేపధ్యంలో, స్టార్ ఇమేజ్ కలిగిన విజయ్ దళపతి రాజకీయాల్లో అడుగుపెడితే యువతపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆయన పార్టీ ప్రవేశం వల్ల, ఇప్పటికే మూడు ప్రధాన శక్తుల మధ్య పోటీ జరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో నాలుగో శక్తిగా నిలిచే అవకాశముంది.
ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో కస్తూరి (Actress Kasturi) ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
Read Also : ఛీ..ఛీ.. ఇద్దరు పిల్లలుండగా ఇదేం పని..?

