Aneesha Dama : విజయ్ దేవరకొండ, రష్మికా మందాన జంటగా నటించిన ‘గీత గోవిందం’ సినిమా 2018లో విడుదలై, ఒక భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించారు. ‘గీత గోవిందం’ సినిమా అప్పటివరకు విజయ్ దేవరకొండ కెరీర్‌లో అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచి, అతడిని ఒక స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రష్మికా మందానకు కూడా తెలుగులో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండను లవ్ చేసే అమ్మాయిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ నటి అనీషా దామా. అనంతరం పెళ్ళికూతురు పార్టీ, సత్తిగాని రెండెకరాలు సినిమాలు చేసినా.. ఈ భామకు వీటితో పెద్దగా గుర్తింపు రాలేదు. క్రేజీ లుక్స్‌తో ఈ అమ్మడు ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


