Priyanka mohan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని ప్రస్తుతం కెరీర్ పీక్స్‌లో ఉన్న నటి ప్రియాంక మోహన్, అయితే తాజాగా సోషల్ మీడియాలో(social media) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి ఆమె బోల్డ్ ఫోటోలోను సోషల్ మీడియాలో వదిలారు కొందరు కేటుగాళ్లు.
నిజమైన ఫోటోల మాదిరిగానే ఈ AI-సృష్టించిన చిత్రాలు ఉండటంతో, చాలా మంది నెటిజన్లు అవి నిజమని నమ్మి షేర్ చేశారు.దీనిపై ప్రియాంక వెంటనే స్పందించారు. తనను తప్పుగా చిత్రీకరిస్తూ సృష్టించిన నకిలీ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుండటంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

“నన్ను తప్పుగా చూపిస్తూ AI-సృష్టించిన కొన్ని చిత్రాలు ప్రచారంలో ఉన్నాయి. దయచేసి ఈ ఫేక్ దృశ్యాలను షేర్ చేయడం వెంటనే ఆపివేయండి. AI టెక్నాలజీని కేవలం నైతిక సృజనాత్మకత కోసం మాత్రమే ఉపయోగించాలి, తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏం సృష్టిస్తున్నాం, ఏం షేర్ చేస్తున్నాం అనేదానిపై అందరం జాగ్రత్తగా, బాధ్యతగా ఉందాం. ధన్యవాదాలు.”

ప్రియాంక మోహన్(Priyanka mohan) ప్రకటనతో, ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ తరహా సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా AI-సృష్టించిన హీరోయిన్ల ఫెక్ ఫోటోలు సర్క్యులేట్ కావడం ఈ మధ్యకాలంలో ఒక ఆందోళనకరంగా మారింది. ఇటీవల సాయిపల్లవి, అంతకుముందు రష్మిక ఇలాంటి అనుభవాన్ని ఎదురుకున్నారు.
ప్రియాంక అరుళ్ మోహన్, పవన్ కళ్యాణ్ (pawan kalyan)సరసన ‘దే కాల్ హిమ్ ఓజీ'(They call Him OG) సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె పవర్ స్టార్ భార్య కన్మణి పాత్రను పోషించింది. OG సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చింది. మొదటి వారంలో మంచి వసూళ్లను సాధించింది.
..
Read Also :

