Mangli : ఫోక్ సింగర్ మంగ్లీ మరో గొప్ప ఘనత సాధించింది. ఫోక్ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టి యాంకర్ గా మారింది మంగ్లీ అలియాస్ సత్యవతి.
ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ వైపు వెళ్లిపోయింది. తన గాత్రంతో, నాట్యంతో అందరిని ఆకట్టుకుంది. కోట్లాది మంది ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
పండుగలు వస్తున్నాయంటే మంగ్లీ పాట కోసం ప్రజలంతా వేచి చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఆమెను తెలుగు ప్రజలు ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

అయితే.. తెలుగులో ఎంత పేరు వచ్చినా.. దేశవ్యాప్తంగా రాణించాలంటే మాత్రం కష్టమే. ఇతర భాషల నుండి సింగర్స్ వచ్చి తెలుగులో పాటలు పాడతారు. కానీ తెలుగువారికి ఇతర భాషల్లో అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి.
అసలు తెలుగువారిని ఇతర ఇండస్ట్రీల వారు గుర్తించడమే కష్టం. కానీ అలాంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత రోజుల్లో.. మంగ్లీ(Mangli) ఓ గొప్ప ఘనత సాధించింది.

దేశంలోనే గొప్ప గొప్ప సింగర్స్ సరసన నిలబడి పాట పాడింది. కైలాస్ ఖేర్, అనూప్ శంకర్, అంటారా నాందీ, అంకిత నాందీ, సుజీత్ వాసుదేవన్ వంటి దేశంలోనే టాప్ సింగర్స్ తో తాను గాత్రం కలిపింది.
కల్యాణ్ జువెల్లర్స్ సంస్థ నవరాత్రుల సందర్భంగా ఓ పాటను చిత్రీకరించింది. ఇందులో వీరంతా కనిపించారు.
అయితే.. తెలుగులో చాలా మంది టాప్ సింగర్స్ ఉన్నారు. పేరుగాంచిన, జాతీయ అవార్డులు అందుకున్న సినీ నేపథ్యగాయకులు కూడా ఉన్నారు.
కానీ దేశంలోని టాప్ సింగర్స్ తో కలిసి పాడే అవకాశం ఒక జానపద గాయని.. ఒక ఎస్టీ బిడ్డ మంగ్లీకి, ఆమె సోదరి ఇంద్రావతికి దక్కింది.
సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే మాట కూడా మనం చాలా సార్లు వింటూనే ఉంటాం.

కానీ అలాంటి వాటన్నింటిని దాటకుని మంగ్లీ దూసుకెళ్లింది. హమ్ కిసీసే కమ్ నహీ హై.. అని నిరూపించింది. దేశంలోనే అగ్రగాయకుల సరసన తాను కూడా నిలిచింది.
ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ.. ఇప్పుడు ఈ పాటతో దేశవ్యాప్తంగా తన పవర్ ఏంటో చూపించింది. తెలుగువాళ్ల సత్తా ఇది.. అని చాటిచెప్పింది.
..
Read Also :.

