Little Hearts : లిటిల్ హార్ట్స్ సినిమా నిజంగానే అందరి హార్ట్స్ దోచేస్తోంది. ఈ మధ్యకాలంలో ఆడియన్స్.. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ కంటే కామేడీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు.
కథతో సంబంధం లేకుండా కామెడీ కోరుకుంటున్నారు. ఎంటర్ టైన్ అయ్యామా లేదా అని చూస్తున్నారు.
ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని లిటిల్ హార్ట్స్(Little Hearts) సినిమా తీసినట్టుగా కనిపిస్తోంది.

కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక యూత్ అయితే ఫిదా అవుతారు.
ఒక రకంగా చెప్పాలంటే దీన్నిపిల్లబచ్చా లవ్ స్టోరీ అనొచ్చు. యంగ్ స్టర్స్ ని ఎట్రాక్ట్ చేసే ఉద్దేశంతో సినిమా తీసినట్టుగా కనిపిస్తోంది.

అలాగే థియేటర్ లోకి ఎంటర్ అయ్యింది మొదలు.. బయటకు వెళ్లే వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉండాలన్న లక్ష్యంతో డైరెక్టర్ సాయి(sai marthand) ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రతీ సందర్భంలో కామెడీని ఫిల్ చేసి ప్రేక్షకుల పైకి వదిలాడు.
అందుకే మూవీలో కావాల్సినంత ఫన్ ఉంది. హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన కామెడీ సీన్లు, డైలాగులు కడుపు నొప్పి తెప్పించడం పక్కా.!

సాంగ్స్ లో కూడా కామెడీతో నింపేశారు. మ్యూజిక్ తో కామెడీని కలిపికొట్టడంతో థియేటర్లలో ప్రేక్షకులు నవ్వి నవ్వి కడుపు పట్టుకుంటున్నారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో యూత్ మనసు దోచిన శివానీ (Shivani nagaram)ఈ మూవీతో మరోసారి హార్ట్ ఫేవరేట్ అయ్యింది.

మౌళి తనూజ్ (mouli tanuj prashanth)యాక్టింగ్ కు వేలెత్తి చూపించాల్సిన పనిలేదు. ఓవరాల్ గా ప్రతీ ఒక్కరు అద్భుతంగా చేశారు.
ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా.
Read Also : కుక్క కరిస్తే ఏం చేయాలి..?

