Katara chapter 1 review: ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏం చేసినా బాగానే ఉంటుంది..
అదే అంచనాలున్నప్పుడు అద్భుతం జరగడానికి ఆకాశాన్ని అందుకోవాలి..
కాంతారా చాప్టర్ 1 విషయంలో రిషబ్ శెట్టి చేసింది ఇదే..
అంచనాల ఆకాశానికి నిచ్చెన వేయడానికి ప్రయత్నించాడు..
నిజం చెప్తున్నా.. కాంతారా చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ మాత్రం ఇప్పుడు రాలేదు..
అంతా బాగానే ఉన్నా ఎక్కడ ఒక వెలితి మాత్రం మిగిలిపోయింది..
ఫస్టాఫ్ చూసిన తర్వాత ఎందుకు కాంతారా లాంటి సబ్జెక్టు రిషబ్ మళ్లీ ముట్టుకున్నాడు అనిపించింది..
ఫస్ట్ పార్ట్ లో ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది..
అందుకే అది ఒక అద్భుతంలా కనిపించింది..
సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి బడ్జెట్ పెరిగింది.. ఆ రియల్ ఫీలింగ్ ఎందుకో తగ్గిపోయింది..
ఆర్టిఫిషియల్ గా కథ ముందుకు వెళ్తున్నట్టు అనిపించింది..
కొన్ని సీన్లు అవసరం లేదేమో..
కానీ సెకండ్ హాఫ్ డీసెంట్ గా రాసుకున్నాడు..
కాంతారా ప్రజలు తమ ఉనికి కోసం, దేవుడి కోసం ఎలాంటి పోరాటం చేశారు అనేది ఈ సినిమా కథ..
సెకండ్ హాఫ్ లో దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు కమ్ నటుడు రిషబ్ శెట్టి..
యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా కుదిరాయి..
హీరో శరీరంలోకి కాంతారా వచ్చినప్పుడు ఉండే సన్నివేశాలు మరోసారి గూస్ బంప్స్..
క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రాణం..
సేమ్ కాంతారా మాదిరే ఇందులో కూడా అదిరిపోయే క్లైమాక్స్ రాసుకున్నాడు రిషబ్..
రిషబ్ శెట్టి మరోసారి అద్భుతంగా నటించాడు..
రుక్మిణి వసంత్ కూడా కీలకమైన పాత్రలో మెప్పించింది..
గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ వెరైటీగా ఉంది..
దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫస్ట్ పార్ట్ రేంజ్ లో మెప్పించలేదేమో అనిపించింది..
ఇది కూడా బాగానే ఉంది కానీ ఎక్కడో ఆ ఫ్రెష్ ఫీల్ మిస్ అయింది..
అజినీష్ లోక్నాథ్ మరోసారి తన మ్యూజిక్ తో సినిమాను నిలబెట్టాడు..
ఓవరాల్ గా కాంతారా చాప్టర్ 1.. అంచనాలు లేకుండా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు..!
Katara chapter 1 review: ఆ స్థాయిలో అరుపులు లేవమ్మా..

