Rashmika Mandanna : నటి రష్మిక మందాన, విజయ్ దేవరకొండకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. కానీ వారిద్దరు మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఎప్పుడెప్పుడు క్లారిటీ ఇస్తారా.? అని ఫ్యాన్స్ అంతా రష్మిక(Rashmika Mandanna), విజయ్ (vijay devarakonda) సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకుని మరీ చూస్తూ కూర్చున్నారు.

కానీ ఇదే సమయంలో రష్మిక మందాన అందరికి షాకిచ్చింది. ఎంగేజ్ మెంట్ గురించి చెబుతుందేమోనని అంతా అనుకున్నారు. సంప్రదాయబద్దమైన దుస్తుల్లో ఇద్దరి ఫొటోలు చూసి మురిసిపోదామనుకున్నారు.
మీమ్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేద్దామనుకున్నారు.
కానీ రష్మిక మాత్రం ట్రెడిషనల్ లుక్ ఫొటోలకు బదులు హాట్ హాట్ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.
తన ఒక్కదాని ఫొటోలు పెట్టి వదిలేయలేదు. అందులో ఆయుష్మాన్ ఖురానాతో రొమాంటిక్ స్టిల్స్ ఉన్నాయి.

ఇవి చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు.
విడుదలకు సిద్ధమవుతున్న THAMMA అనే సినిమాలో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana)తో కలిసి రష్మిక మందాన నటిస్తోంది.

ఆ సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ కు సంబంధించిన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఆ పాటకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.
చాలా విభిన్నమైన పరిస్థితుల్లో పాటను చిత్రీకరించినట్టు రష్మిక చెప్పింది. చాలా చల్లని ప్రదేశంలో సినిమా షూటింగ్ జరిగిందని తెలిపింది. సడెన్ గా డైరెక్టర్ వచ్చి పాట కూడా ఇక్కడే చిత్రీకరిద్దామని చెప్పారట.

దీంతో అప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకుని సాంగ్ షూట్ చేశామని చెప్పుకొచ్చింది.

ఆ సాంగ్ లిరికల్ వారం క్రితమే రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఇప్పుడు ఫొటోలు పెట్టి.. మరోసారి యూత్ ను షేక్ చేస్తోంది రష్మిక.

ఎంగేజ్ మెంట్ అప్డేట్ చెప్పమంటే.. ఇదేంటని అంతా ఉసూరుమంటున్నారు.
..
Read Also :.
- KCRపై కవిత సంచలన వ్యాఖ్యలు
- ప్రయివేటు చేతికి ఆర్టీసీ.. సజ్జనార్ ను తప్పించింది అందుకేనా.?
- ఒంటరి మహిళపై కన్నేసిన సీఐ
- కేబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి.!
- 42 శాతం రిజర్వేషన్ కు బ్రేక్.. సర్కారు పెద్ద మోసం..!
..

