Wife : “ప్రేమ కోసం పెళ్లి… కానీ అదే ప్రేమ ప్రాణాంతకమైంది.
15 ఏళ్ల దాంపత్య బంధం(wife killed husband)… ఇద్దరు కుమార్తెలు.
కానీ, ఒక్క అక్రమ సంబంధం… ఆ కుటుంబాన్ని చీల్చి వేసింది.”
కృష్ణా జిల్లా (krishna district) గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో జరిగింది ఇది.
లక్ష్మణ్, పావని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
ఏళ్ల తరబడి సాగిన ఆ బంధం… క్రమంగా చెదిరిపోయింది.
పావనికి సమీప బంధువు ప్రదీప్‌తో పరిచయం… ఆ పరిచయం తరువాత వివాహేతర సంబంధంగా మారింది.
అందరికి దూరంగా… గుట్టు గప్పున కలుసుకోవడం…
అది గమనించిన భర్త లక్ష్మణ్ తరచూ ప్రశ్నించేవాడు…
ప్రతి ప్రశ్నే గొడవగా మారేది…
ప్రతి గొడవే పావని మనసులో కోపాన్ని పెంచేది…
చివరికి “భర్తే అడ్డుగా ఉన్నాడు(wife killed husband)… తొలగిస్తేనే స్వేచ్ఛ” అన్న దురాలోచన పుట్టింది.
ఈ నెల 13న… ప్రియుడితో కలిసి పావని తన భర్తను హతమార్చింది.
అంతే కాదు… ఎవరూ అనుమానం రాకుండా తొందరపడి అంత్యక్రియలు జరిపేసింది.
కానీ… రహస్యం ఎక్కువ కాలం దాగలేదు.
బంధువుల అనుమానాలు పెరిగాయి…
ఆరా తీయగా పావని–ప్రదీప్ సంబంధం బయటపడింది.!
విచారణలో నిజం ఒప్పుకున్న పావని… చివరికి పోలీసుల చెరలో చిక్కుకుంది.
“ప్రేమ కోసం పెళ్లి చేసుకున్న భార్య… అదే ప్రేమ కోసం ప్రియుడితో కలసి భర్త ప్రాణం తీశింది… ఈ సంచలన ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.”
Read Also :

