Pawan kalyan : ఈ వెర్రి పూ** పనులే ఆపండి..! పవన్ వర్సెస్ బాబు..!

Pawan kalyan : ఏపీ కూటమి సర్కారులో కుంపట్లు రాజుకుంటున్నాయి. పవన్ కల్యాణ్(Pawan kalyan), చంద్రబాబు (Chandrababu )మధ్య దూరం అంతకంతకూ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి.. తెలుగుదేశం(Telugudesham party), జనసేన(janasena) నాయకులు, కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పుడు అవి మరింత పీక్స్ కు చేరినట్టుగా కనిపిస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతిలో మొదటి భవన ప్రారంభవేళ ఈ విభేదాలు మరింతగా బయటపడ్డాయి.

ఈ కార్యక్రమానికి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP deputy CM)హాజరుకాలేదు. ఒకవేళ ఆయన ఇతరత్రా కారణాలతో రాకపోయినా.. ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకంపై అయినా ఆయన పేరు పెట్టాలి.

కానీ  శిలాఫలకంపై పవన్ కల్యాణ్ పేరు లేదు. దీంతో జనసైనికులు రగిలిపోతున్నారు. సోషల్ మీడియాలో బూతులతో విరుచుకుపడుతున్నారు.

AP CRDA Building Inaugration

తమ ఓట్లతో, తమ బలంతో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు కథలు పడుతున్నారంటూ తిడుతున్నారు.

“ఇదిగో ఇలా వెర్రి పూ… పనులు చేస్తేనే… రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఎన్నో, ఎన్నెన్నో త్యాగాలు చేసి, ఎంతో, మరెంతో తగ్గి ప్రజలకు మేలు చేయాలని దానికోసం ఎంతో ఓర్పుతో ఉంటూ… నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు, టీడీపీలను నేటి బీజేపీ అధినాయకత్వం ఈసడిoచుకుంటున్నా … తనపై బీజేపీ పెద్దలకున్న ప్రేమాభిమానాలతో వారిని పొత్తుకు ఒప్పించి రాష్ట్రంలో జగన్ పాలన అంతమే లక్ష్యంగా నడుం బిగించి ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి ముఖ్య కారకులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఒక్కరే కారణం.

ఎవరో యువగళo చేస్తేనో లేక ఇంకెవరినో రాజమండ్రి సెంట్రల్ జైలులో వేస్తేనో సింపతితో గెలిచాం అని డప్పు కొట్టుకున్నా అది నిజం కాదని వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు ప్రారంభం చేసిన CRDA, ADCL, మున్సిపల్ భవనాల ప్రారంభోత్సవం అనే ఈ కీలక కార్యక్రమంలో జనసేనాని ఊసే లేకుండా చేయాలని తలపోసిన వారు ఎవరు? రాసి పెట్టుకోండి టీడీపీ అరాచకాలకు, వారి ఒంటెద్దు పోకడలకు అంతం పలికే ఘట్టానికి ఇదే ప్రారంభం.

పడుతున్నారు కదా అని అరాచకాలు చేస్తూ పోవడానికి ఇది కాలం కాదు. ఖబడ్దార్ ఇకనైనా.

జనసేనపార్టీలో అధికారిక పదవులు అనుభవిస్తూ పార్టీని, నాయకుణ్ణి పలచన చేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలను ఖండించండి.

..

 

Also Read :