Breaking News : ఏపీ లిక్కర్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నకిలీ మద్యంపై కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదంలో సెన్సేషనల్ అంశాలు బయటకొచ్చాయి.
నకిలీ మద్యం కేసులో నిందితుడిగాఉన్న జనార్దన రావు సంచలన విషయాలు బయటపెట్టారు.
గత వైసీపీ పాలనలో జోగి రమేష్ (jogi ramesh) ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్దన్ రావు అంగీకరించారు. ఏపీలో ప్రభుత్వం మారగానే నకిలీ మద్యం తయారీ ఆపేసినట్టు తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయాలని తనకు చెప్పారని జనార్దన్ రావు అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ తనతో చెప్పారన్నారు.

అలా చేస్తే తన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేస్తానని జోగి రమేష్ చెప్పాడన్నారు.
ఇబ్రహీంపట్నంలో తయారీ మొదలు పెట్టాలని అనుకున్నా.. జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రారంభించినట్టు వివరించాడు.
తంబళ్లపల్లెలో మొదలుపెడితే చంద్రబాబు సర్కారుపై బురద చల్లొచ్చని జోగి రమేష్ చెప్పారన్నాడు.
గది అద్దెకు తీసుకుని.. అందులో నకిలీ మద్యం తయారీ యంత్రాలు తీసుకొచ్చి పెట్టినట్టు వివరించాడు.
అంతా సిద్ధం చేశాక.. తనను ఆఫ్రికాలోని ఫ్రెండ్ దగ్గరకు పంపించాడన్నారు. ఆ తర్వాత తన మనుషుల లీక్ ఇచ్చి రెయిడ్ చేయించాడన్నారు.
జనార్దన్ రావు కామెంట్స్ ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతున్నాయి.
..
Also Read :

