AP Cabinet : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాదాపు 13 బిల్లుల అంశాలకు ఆమోదం తెలిపారు. నాలా ఫీజు రద్దుకు సంబంధించి చట్టాలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా సవరణకు ఆమోదం తెలిపారు. రాజధానిలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPV) ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఓటర్ల జాబితా తయారీకి మరో 3 తేదీలు ఖరారు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పరిధిలో గతంలో 343 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ బిల్లు 2025లో పలు సవరణల ప్రతిపాదనలకు ఓకే చెప్పింది.
వాహనమిత్ర కింద రూ.15 వేలు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది.
…
Read More :

