BRS : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే కవితపై పార్టీ లోపల అసంతృప్తి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఇటీవల పార్టీ లైన్‌కు విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ నేరుగా కఠిన చర్య తీసుకున్నారు.
కవిత సస్పెన్షన్‌తో బీఆర్ఎస్లో పెద్ద కలకలం రేగింది. ముఖ్యంగా ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం మధ్య ఈ నిర్ణయం రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇకపై ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుందో అన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.
Read Also : కవిత కొత్త పార్టీ ఎప్పుడంటే..?

