Shraddha das : హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నటి శ్రద్ధాదాస్ కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. ఆమె తన అపార్ట్మెంట్‌లో ఏర్పాటు చేసిన గణేశుడి నిమజ్జన ఊరేగింపులో భాగమై రోడ్డుపైకి వచ్చి సందడి చేశారు.
సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొన్నా కొంత దూరంగా ఉంటారు. కానీ శ్రద్ధాదాస్ మాత్రం పూర్తిగా జనం మధ్య కలిసిపోయి ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఊరేగింపులో డోలు వాయిస్తూ, తన స్నేహితులతో కలిసి తీన్మార్ స్టెప్పులు వేస్తూ అందరినీ అలరించారు. ఆమె డ్యాన్స్ చూసి అక్కడున్న చిన్నా పెద్దా అందరూ ఆనందపడ్డారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సమయంలో వర్షం కూడా కురిసింది. కానీ వర్షం వస్తోందని పట్టించుకోకుండా శ్రద్ధాదాస్ ఉత్సాహంగా స్టెప్పులు వేయడం, డోలు మోగించడం అక్కడి వాతావరణాన్ని మరింత హుషారుగా మార్చింది. ఆమెతో పాటు యువత, పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తూ ఆ పండుగను మరింత రంగులమయం చేశారు.
ఈ వేడుకల వీడియోను శ్రద్ధాదాస్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. వీడియో బయటకు రాగానే అది తెగ వైరల్ అయింది. అభిమానులు ఆమె సరదా, సింపుల్‌గా కలిసిపోయిన తీరు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇదే అసలు గణేశ్ నిమజ్జనోత్సవాల్లో బెస్ట్ మోమెంట్” అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
శ్రద్ధాదాస్ ఈ విధంగా పాల్గొనడం వల్ల ఆమె అభిమానులు మాత్రమే కాదు, ఇతరులు కూడా చాలా ఆనందపడ్డారు. పండుగలో అందరితో కలసి సరదాగా ఎంజాయ్ చేయడం వల్ల ఆమె మరింత దగ్గరయ్యారు.
మొత్తం మీద, శ్రద్ధాదాస్ గణేశ్ నిమజ్జనంలో చేసిన ఈ సందడి ఇప్పుడంతా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
Read Also : కవిత కొత్త పార్టీ ఎప్పుడంటే..?

