Revanth reddy : పీకేద్దామా..? ఆలోచనలో అధిష్టానం..?

Revanth reddy destroyed Rahul Gandhi campaign in bihar

Revanth reddy : త్వరలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికోసం అక్కడ రాహుల్ గాంధీ(rahul gandhi), ప్రియాంకగాంధీ (priyanka gandhi)ప్రచారం మొదలు పెట్టారు. ఓట్ చోర్ పేరుతో మోడీపై(modi) ఆరోపణలు చేస్తున్నారు.

రాహుల్ గాంధీ యాత్ర, సభలకు ప్రజల నుంచి భారీగానే స్పందన వస్తోంది. వాస్తవానికి బిహార్ లో పరిస్థితులు ఈ సారి ఇండి కూటమికి కాస్త అనుకూలించేలాగానే కనిపిస్తున్నాయి.

కానీ రీసెంట్ గా అక్కడ రేవంత్ రెడ్డి (Revanth reddy)ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఇది ఇప్పుడు బిహార్ (Bihar)లోనే కాదు.. దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.

Revanth reddy in voter adhikar yatra

రాహుల్ గాంధీ బిహార్ లో  ఓటర్ అధికార్ పేరుతో యా త్ర చేస్తుండటంతో.. ప్రత్యేకంగా ఎలాంటి ఆహ్వానం లేకున్నా.. కర్టసీ మీట్ లాగా రేవంత్ రెడ్డి వెళ్లారని తెలుస్తోంది. ఎలాగూ వచ్చారు కదా అని రోడ్ షోలలో రేవంత్ రెడ్డిని తమతో పాటు బస్సుపై నిలబెట్టుకున్నారు.

కానీ అది పూర్తిగా రివర్స్ అయ్యింది.

Read Also :

రేవంత్ ఎంట్రీతో రాహుల్ గాంధీకి పరేషాన్..

అప్పటి దాకా రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్(Election Commission) పై, మోడీపై ఓట్ చోర్(vote chor) అంటూ చేసిన కామెంట్లకే బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అలాగే ప్రశాంత్ కిషోర్ కూడా బిహార్ కు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు.

కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారో.. అప్పటి నుండి పూర్తిగా రాజకీయాలన్నీ కూడా ఆయనవైపు తిరిగాయి.

దీనికి కారణం.. గతంలో బిహార్ పై, బిహార్ ప్రజలపై, తెలంగాణలో ఉన్న బిహార్ అధికారులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.  బిహార్ లో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదని.. ప్రజల బికారీలని, వాళ్ల డీఎన్ఏపై కూడా రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు.

దీంతో ఇప్పుడు అటు బీజేపీ, ఇటు ప్రశాంత్ కిషోర్(Prashanth Kishore).. ఇండి కూటమిలో లేని ఇతర పార్టీలన్ని అవే కామెంట్స్ పై రేవంత్ రెడ్డిని టార్గెట్  చేస్తున్నాయి.

బిహార్ ప్రజలను తిట్టిన వ్యక్తితో ఎన్నికల ప్రచారం ఎలా చేయిస్తారని  రాహుల్ గాంధీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. బిహార్ ప్రజలపై కాంగ్రెస్ కు ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో దీని ద్వారానే అర్థమవుతోందని ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

బిహార్ ప్రజలపై రాహుల్ గాంధీ వైఖరి కూడా అదేనా అని ప్రశ్నిస్తున్నారు.

అతి తక్కువ సమయంలోనే ఈ అంశం రాజకీయ దుమారం రేపింది. రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి.. పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ను ఎటాక్ చేస్తున్నాయి.

దీంతో హస్తం అధిష్టానం కూడా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.

revanth reddy in voter adhikar yatra 1

ఇంకెన్ని రోజులు ఈ తిప్పలు..?

ఇప్పటికే రేవంత్ రెడ్డి విషయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సీరియస్ గా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సమయంలోనూ రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

లగచర్ల ఘటన జాతీయ స్థాయికి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. హర్యానా(Haryana)లో కాస్త పరువు దక్కినా.. మహారాష్ట్రలో(Maharashtra) మాత్రం ఘోరంగా ఓడిపోయింది. జమ్మూకశ్మీర్(Jammu and kashmir) లో కూడా అదే పరిస్థితి అయ్యింది.

Read Also : మరోసారి షాక్ ఇచ్చిన ట్రంప్..!

ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకత పెరుగుతుండటంతో.. అది బిహార్ లో తమకు అనుకూలిస్తుందని కాంగ్రెస్ భావించింది.

దీనికి తోడు ఓట్ చోరీ అంశం కూడా చాలా బాగా కలిసి వస్తుందని అనుకుంది. అనుకున్నట్టుగానే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

కానీ రేవంత్ రెడ్డి అరంగేట్రంతో అది పూర్తిగా తలకిందులైనట్టుగా తెలుస్తోంది.Image

దీంతో ఈ అంశంపై పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉంచడం వల్ల మనకు లాభాలేంటీ.? ఆయనను తొలగిస్తే కలిగే నష్టాలేంటీ.? అనే అంశాలపై చర్చించినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

“పార్టీకి ఆర్థిక సహాయం విషయానికొస్తే.. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా చేస్తారు… దానికోసం రేవంత్ రెడ్డే ఉండాల్సిన అవసరం ఏముందనే” మాట కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

వరుసగా ఎన్నికల్లో పార్టీని కుదేలు చేస్తూ.. పాజిటీవ్ ఓటును.. నెగెటివ్ ఓటుగా మారుస్తున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.

అలాంటి వ్యక్తిని  ఇంకెన్నాళ్లు నెత్తిన  పెట్టుకుని ఇంకెన్నాళ్లు ఊరేగాలని కూడా పార్టీ పెద్దలు(Sonia Gandhi) తమ సన్నిహితులను ప్రశ్నించినట్టుగా సమాచారం.

బీజేపీతో సన్నిహిత సంబంధాలు.. వరుసగా మోడీతో భేటీల అంశం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియాలో పెట్టినా కూడా వారిపై కేసులు పెట్టకపోవడం.. కనీసం కౌంటర్ ఇవ్వకపోవడం వంటి అంశాలపైనా చాలాసేపు చర్చ జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.Sonia gandhi not seen revanth reddy

దీంతో.. వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేస్తే తప్పా దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదనే అభిప్రాయానికి వారు వచ్చినట్టుగా తెలుస్తోంది.

మంచి ముహూర్తం చూసి టాటా.. బైబై.. చెప్పాల్సిందేనని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

అయితే.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి లేవనే సంకేతాలు పంపేందుకు కొద్దిరోజులుగా బీజేపీ  నేతలు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

కానీ ఈ సారి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదని అంటున్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు మెరుగు పడాలని..  అధికారం పీఠంపై కూర్చోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అది జరగాలంటే ఇలాంటోళ్లను పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు సలహా ఇచ్చారట.

మరి ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

Read Also :