Wanaparthy : తులం బంగారం రేవంత్ రెడ్డి ఇయ్యలే.. అత్తగారు ఇచ్చిన్రు..!

Wanaparthy : సాధారణంగా దసరా, సంక్రాంతి పండుగలకు కొత్త అల్లుడిని ఇంటికి పిలిపించి అత్యంత ఘనంగా మర్యాదలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప సంప్రదాయం.

ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణలో దసరా పండుగకు ఇంటికొచ్చిన ఓ కొత్త అల్లుడికి 101 రకాల వంటకాలతో అద్భుతమైన విందు ఏర్పాటు చేశారు అత్తమామలు.

అయితే ఇందులో ఒక్క వంటకం తగ్గడంతో విందుతో పాటుగా తులం బంగారం కూడా దక్కించుకున్నాడు ఆ అల్లుడు.. వివరాల్లోకి వెళ్తే..  వనపర్తి జిల్లాలోని కొత్తకోట పట్టణానికి  చెందిన గుంత సురేష్, సహన దంపతులు తమ కూతురు సింధుకు వరంగల్‌కు చెందిన నిఖిత్‌తో వివాహం చేశారు.

పెళ్లి తర్వాత దసరా పండుగకు తొలిసారి అల్లుడిని ఇంటికి ఆహ్వానించారు.  మొదటి పండుగ కావడంతో అల్లుడికి 101 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు అత్తమామలు.

30 రకాల పిండి వంటలు, 60 రకాల స్వీట్లు అన్నంతో కలిపి రుచికరమైన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.

ఈ విందును చూసి ఆశ్చర్యపోయిన అల్లుడు నిఖిత్, అత్తమామలతో సరదాగా101 రకాల వంటకాలలో ఒక వంటకం తగ్గిందని నిరూపిస్తే ఏమిస్తారని అత్తమామలను సరదాగా అడిగాడు నిఖిత్.

ఒక్క వంటకం తగ్గితే తులం బంగారం ఇస్తామని సవాల్ చేశారు. లెక్కేసి చూపించి విందుతో పాటుగా తులం బంగారం దక్కించుకున్నాడు ఆ అల్లుడు.  ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

అయితే రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు ఇస్తానన్న తులం బంగారం ఇవ్వకున్నా.. ఈ అత్తగారు మాత్రం తమ అల్లుడికి తులం బంగారం ఇచ్చారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

Read Also :.