DSP Nalini : దెబ్బకు దిగొచ్చిన సీఎం.. ఇప్పుడైనా  అందేనా.?

CM Revanth reddy responded on DSP Nalini issue

DSP Nalini : డీఎస్పీ నళిని మరణ వాంగ్మూలంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 21న నళిన తన ఫేస్ బుక్ పేజీలో ఓ పెద్ద లేఖ రాసి పెట్టారు.

అది తన మరణ వాంగ్మూలమని చెప్పారు. తన బాధలన్నీ అందులో వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అప్లికేషన్లు చెత్తబుట్టలో పడేశారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్నానని చెప్పారు. హాస్పిటల్ కు వెళ్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నానని ఆమె చెప్పారు.

ఆధ్మాత్మిక జీవితానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు.

అనారోగ్యానికి ట్రీట్మెంట్ సహకరించాలని కోరారు. అయితే నళిని (dsp nalini)రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎం తీరుపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగం  వదిలేసిన అధికారిని ఇబ్బందులు పెట్టడంపై మండిపడ్డారు.

ఈ విషయం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి (Revanth reddy)దృష్టికి కూడా వెళ్లింది. ఆయన కార్యాలయం నుండి యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు.

దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు.. నళిని ఇంటికెళ్లి కలిశారు. ప్రభుత్వం సహాయం చేసేందుకు  సిద్ధంగా ఉందని తెలిపారు. సర్వీస్ సంబంధించిన సమస్యలు ఏమున్నా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.

అయితే ఇప్పుడైనా సమస్య పరిష్కరిస్తారా.? లేకపోతే కేవలం మరోసారి పబ్లిసిటీ స్టంట్ చేసి వదిలేస్తారా అన్న చర్చ జరుగుతోంది.

Read Also :