KA PAUL : పాల్ పై లైంగిక వేధింపుల కేసు.. ఆయన ఏమన్నారంటే..?

sexual harassment case filed on KA PAUL

KA PAUL :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. కేఏ పాల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేఏ పాల్ కు(KA PAUL) చెందిన కంపెనీలో తాను పనిచేస్తానని పోలీసులకు తెలిపారు. నైట్ ఫిష్ట్ లో ఉన్న తనను ఆయన లైంగికంగా వేధించారని అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను వాట్సాప్ ద్వారా షీ టీమ్స్ పంపించారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

అయితే.. ఈ ఆరోపణలను  కేఏ పాల్ ఖండించారు. వాటిలో నిజం లేదని.. అన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే తెలంగాణలోని పార్టీలు ఈ డ్రామాకు తెరలేపాయని చెప్పారు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానన్న ఆయన.. రాగానే అన్ని విషయాలు చెబుతానన్నారు.

దీన వెనకాల ఉన్నవారి వివరాలు బయటపెడతానని వెల్లడించారు. మత ప్రచారకుడిగా ప్రపంచదేశాల్లో మంచి పేరున్న వ్యక్తి కేఏ పాల్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి(ys rajashekar reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై హత్యానేరం ఆరోపణలు వచ్చాయి. సోదరుడి మరణం విషయంలో కేఏ పాల్ ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది.

అప్పటిదాకా ఓ వెలుగు వెలిగిన కేఏ పాల్.. ఆ తర్వాత పూర్తిగా మత ప్రచార కార్యక్రమాలకు దూరం అయ్యారు. ప్రజలంతా ఎంతో గౌరవంగా చూసే ఆయన ఇప్పుడు పూర్తిగా పలుచన అయిపోయారు.

ఇప్పుడు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో గతంలో ఆయన విషయంలో జరిగిన సంఘటనలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

Read Also :