Breaking News : మైనార్టీలకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50 వేలు

Big Breaking:మైనార్టీలకోసం రెండు కొత్త పథకాలను…… రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన.

రేవంతన్నకా సహారా మిస్కీన్ కేలియే పథకాలను. సచివాలయంలో రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఆరెండు పథకాలని ఆన్ లైన్ దరఖాస్తుల కోసం పోర్టల్ ను మంత్రి ఆవిష్కరించారు. రెండుపథకాలకు ప్రభుత్వం 30 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన కింద మైనార్టీ వితంతువులు, అనాథ, అవివాహిత, ఒంటరి, అవివాహిత మహిళలకు స్వయం ఉపాధి కోసం 50వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు. అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు

రేవంతన్న కా సహారా – మిస్కీన్ కేలియే పథకంలో ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనం కొనుగోలుకి లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబరు 6 వరకి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరని స్పష్టంచేశారు. మైనారిటీల స్థిరమైన అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న పథకాలను అమలు చేస్తామని అడ్లూరి లక్ష్మణ్ వివరించారు.

Read More :