Revanth reddy : మంత్రుల పంచాది.. రేవంత్ కు మనాది..! పాపం..

BREAKING NEWS-11-BATUKAMMA.COM

Revanth reddy : తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. అధికార పార్టీలో పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఎవరికి వారే.. యమునాతీరే.. అన్నట్టుగా అధికార పార్టీ నేతల తీరు కొనసాగుతోంది.

ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్లు కూడా అదే పని చేస్తున్నారు. ఒకరంటే మరొకరికి పొసగడం లేదు. తెలంగాణ కేబినెట్ లో ఏ ఇద్దరు మంత్రుల మధ్య కూడా  సఖ్యత లేదనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.

కొండా సురేఖ (Konda surekha)వర్సెస్ పొంగులేటి(Ponguleti Srinivas reddy), పొన్నం(ponnam Prabhakar) వర్సెస్ అడ్లూరి, అడ్లూరి వర్సెస్ వివేక్, వివేక్(v6 vivek) వర్సెస్ శ్రీధర్ బాబు(Sridhar babu).. సీఎం వర్సెస్ కొందరు మంత్రులు..ఇలా మొత్తం చిందర వందర గందరగోళంగా మారింది పరిస్థితి. దీంతో పాలన సరిగా జరగక రాష్ట్రం ఆగమవుతోంది.

మేడారం కాంట్రాక్టుల విషయంలో పొంగులేటి, కొండా సురేఖ మధ్య లొల్లి మరింత పెరిగింది. అటు తనను దున్నపోతు అన్నాడని.. పొన్నంపై అడ్లూరి ఫుల్లు కోపంతో ఉన్నారు. తనను వివేక్ అవమానిస్తున్నాడని.. ఆయన మీద కూడా కోపంతో ఉన్నారు అడ్లూరి. అటు వివేక్ కు శ్రీధర్ బాబుకు మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరం.. ఇప్పుడు మరింత ముదిరింది.

అటు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కూడా సర్కారుపై తిరగబడుతున్నారు.

దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) రంగంలోకి దిగారని తెలుస్తోంది. మంత్రులందరికి ఫోన్ చేసి.. మీ కొట్లాటలేందని మందలిచ్చినట్టు సమాచారం. వ్యక్తిగత అంశాలు పక్కనపెట్టాలని కాస్త గట్టిగానే చెప్పారట.

మీ వల్ల నేను బద్నాం కావాల్సి వస్తోందని అన్నారట.

అయితే కొందరు  మంత్రులు రివర్స్ లో సీఎంకు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నువ్వేమైనా తక్కువా.. నువ్వూ మంత్రులతో సరిగా ఉండటం లేదు కదా అని.. కొందరు కౌంటర్ ఇచ్చారట. దీంతో చేసేదేం లేక తలపట్టుకున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

గతంలోనూ చాలా సార్లు మంత్రులతో సీఎంతో కాస్త వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన ఇంటి పత్రికలతో మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారని తెలుస్తోంది.

అధికార పార్టీకి చెందిన కొన్ని పత్రికల్లో వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి.

వీటి వెనక ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయమే ఉందన్న చర్చ జరుగుతోంది.

..

Also Read :