Panchayat Elections : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కారు తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలుకు సర్కారుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది.
జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడింది. జీవో 9 ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడంతో ఇప్పుడు ఎన్నికలు కూడా నిలిపేయాల్సి వస్తోంది.
ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజైంది. ఎన్నికల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా నాయకులతో జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు.
అయితే ఎలాగైనా ఎన్నికలు (Panchayat Elections) నిర్వహించాలన్న పట్టుతో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది.
దీనికోసం రేవంత్ రెడ్డి సర్కారు కీలక ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మొన్న మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం వెల్లడించినట్టు సమాచారం.
దీంతో హైకోర్టు ఆర్డర్ కాపీ రాగానే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
..
Read Also :

