Rajgopal reddy : రేవంత్ రెడ్డిని నిద్రపోనివ్వని రాజ్ గోపాల్ రెడ్డి..!

Rajgopal reddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నారు. సర్కారుకు సమాంతరంగా మరో సర్కారును నడిపిస్తున్నారు. కొత్త కొత్త రూల్స్ తో సర్కారుకు చుక్కలు చూపిస్తున్నారు.

ఇప్పటికే పలు అంశాల్లో రేవంత్ రెడ్డికి రాజ్ గోపాల్ రెడ్డి (Rajgopal reddy)చుక్కలు చూపిస్తున్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. డిజిటల్ మీడియాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. నిరుద్యోగులు, ట్రిపుల్ ఆర్ బాధితులకు అండగా ఉంటానని మాట ఇచ్చారు. అవసరమైతే సర్కారును కూల్చేస్తానని హెచ్చరించారు.

ఇప్పుడు సర్కారును ఎదిరిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ టెండర్స్ (wine shoptenders)వేసే వాళ్లకు ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు అదనంగా మరిన్ని నిబంధనలు పెట్టారు. రూల్స్ పాటించకుంటే టెండర్ వేయొద్దని ముందే హెచ్చరించారు.

మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థన్ నారాయణపురం మండలాలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.

wine shop tender conditions by komatireddy rajgopalreddy

రాజ్ గోపాల్ రెడ్డి పెట్టిన నిబంధనలు..

  • వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గం.ల నుండి రాత్రి 8 గం.ల వరకు మాత్రమే మద్యం అమ్మాలి.
  • మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి.
  • ఇతర మండలానికి చెందిన వాళ్ళు టెండర్లు వెయ్యకూడదు.
  • వైన్ షాప్ లు ఊరి బయట మాత్రమే పెట్టాలి.
  • వైన్ షాప్ కు అనుబంధం గా (సిట్టింగ్) పర్మిట్ రూమ్ ఉండవద్దు.
  • ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దు.
  • లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదు.

ఇలా రూల్స్ తో ఏకంగా పాంప్లెట్స్ పంచిపెట్టారు. దీంతో టెండర్ వేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు.

ఇన్ని రూల్స్ పాటిస్తే తమకు గిట్టుబాటు ఎలా అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మెల్యే మాత్రం.. ఇవి ఇక్కడితో ఆగవని.. దశలవారీగా తన నియోజకవర్గంలో మద్యనిషేధం చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు.

..

Also Read :