Liquor sales : దసరా పండుగ మద్యం వ్యాపారుల పంట పండిచ్చింది. సర్కారు ఖజానాకు కాసుల రాశులు తెచ్చింది.
పండుగ సందర్భంగా ప్రతీ ఏడాది మద్యం అమ్మకాలు (Liquor sales) కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఈ ఏడాది కూడా అదే జరిగింది.
ఈ సారి దసరా పండు, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో ముందు నుండే అమ్మకాలు జోరందుకున్నాయి. పండుగ కూడా గాంధీ జయంతికి ముందు.. తర్వాత కూడా జరుపుకున్నారు.
దీంతో దసరా ముందు మూడు రోజుల్లో రూ.700 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. దసరా రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం దుకాణాలు ఓపెన్ చేయరు. దీంతో ముందే స్టాక్ తెచ్చిపెట్టుకున్నారన్నమటా.
ఇక సెప్టెంబర్ 30న అత్యధికంగా రూ.333 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
2024లో దసరా సందర్భంగా 8 రోజుల్లో రూ.852.38 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
అయితే ఈ ఏడాది మాత్రం కేవలం 3 రోజుల్లోనే రూ.697.23 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. శుక్ర, శని, ఆదివారాల సేల్స్ కూడా పూర్తై.. లెక్కలు బయటకు వస్తే.. అది వెయ్యికోట్ల దాకా పోయినా ఆశ్యర్యపోనవసరం లేదు
..
Read Also :.

