Naveen yadav : ఉప ఎన్నిలకు అంతా సిద్ధమైన వేళ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపు ఖరారైన నవీన్ కుమార్ యాదవ్ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. అంటే ఆ క్షణం నుండి ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది.
ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేసినా అనుమతి తీసుకుని చేయాలి. చాలా రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుంది. కానీ.. నవీన్ యాదవ్ మాత్రం వాటన్నింటిని పక్కనపెట్టారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరుకార్డులు పంపిణీ చేశారు. నిన్న రాత్రి ఓ కార్యక్రమం నిర్వహించి.. ఓటరు కార్డుల పంపిణీ అని పెద్ద ఫ్లెక్సీ పెట్టి మరీ కార్యక్రమం నిర్వహించారు.

ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురానగర్ పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
నవీన్ యాదవ్ మీద బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు.
..
Read Also :

