Breaking News : ఆర్టీసీపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీ బస్సుతో ఆర్టీసీ (TGSRTC)లాభాల్లోకి వచ్చిందని చెబుతూనే.. టికెట్ రేట్లు పెంచుతున్నారు. పండుగల పూట భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారు.
అయితే.. ఆర్టీసీని కష్టాల నుండి గట్టెక్కించేందుకు గత ప్రభుత్వం 2020లో కార్గో సేవలను(TSRTC cargo) ప్రారంభించింది. దీని ద్వారా సంస్థను చాలా లాభం జరిగింది. మంచి రెవెన్యూ వస్తోంది.
కానీ ఇది రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారుకు నచ్చనట్టున్నది. లేకపోతే మంచి లాభాలు వస్తున్నాయని తమ వాళ్ల చేతికి అప్పజెప్పేందుకు ప్రణాళికలు వేశారో గానీ.. కార్గోను ప్రయివేటుకు అప్పజెప్పేందుకు టెండర్లు పిలిచారు.

ఆగస్ట్ నెలలోనే దీనికి టెండర్లు పిలిచినా.. అంతా గుట్టుగా నడిపించారు. ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది.
దాదాపు రూ.30 కోట్ల లాభాలు వచ్చే కార్గోను కేవలం రూ.3కోట్లకే ప్రయివేటు కంపెనీకి అప్పజెప్పే కుట్రలకు తెరలేపారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి కార్గో ద్వారా దాదాపు రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.30 కోట్ల వరకు లాభాలే ఉన్నాయి.

అలాంటి సంస్థను కావాలనే.. తమ వాళ్లకు అప్పజెప్పి జేబులు నింపే ప్రయత్నంలో భాగంగానే ప్రయివేటుపరం చేయబోతున్నట్టు కనిపిస్తోంది.
రాష్ట్రంలో అనేక ప్రయివేటు కార్గో, కొరియర్ సంస్థలు సేవలందిస్తున్నాయి. పోస్టల్ శాఖ తప్ప తప్ప ప్రభుత్వరంగ సంస్థలేవీ కార్గో సేవలు అందించడం లేదు. అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
కానీ ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించాక మంచి స్పందన వచ్చింది.
ప్రజలు కూడా ఇతర సంస్థల కంటే ఆర్టీసీ కార్గోనే ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ ఇదే సమయంలో సర్కారు.. దాన్ని తీసుకెళ్లి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసేందుకు సిద్ధమైంది.
సైబరాబాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా నియమించిన తర్వాత కార్గో సేవలు ప్రారంభమయ్యాయి. ఆయనే దగ్గరుండి కార్గో సేవలను సక్సెస్ చేయించారు.
అయితే ఇటీవలే ఆయనను ఆర్టీసీ నుండి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఓ వైపు కార్గోను ప్రయివేటుపరం చేసే పనులు ఊపందుకోవడం.. అదే సమయంలో సజ్జనార్ బదిలీ కావడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. సజ్జనార్ ను ఈ ప్రయివేటీకరణ కోసమే తప్పించారా అన్న చర్చ మొదలైంది.
..
Read Also :.
- ఒంటరి మహిళపై కన్నేసిన సీఐ
- కేబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి.!
- 42 శాతం రిజర్వేషన్ కు బ్రేక్.. సర్కారు పెద్ద మోసం..!
- మటన్ లో కారం ఎక్కువైంది.. నవ వధువు ప్రాణం పోయింది
- కలుద్దాం రమ్మన్నాడు.. డ్రమ్ములో వేసి చంపాడు

