BIG BREAKING : CBIకి ఫోన్ టాపింగ్ కేసు..?

breaking news

BIG BREAKING : తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు (kaleshwaram project)కేసును సీబీఐకి అప్పగించింది ప్రభుత్వం. ఇప్పుడు ఫోన్ టాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy) కొందరు అధికారులతో చర్చించినట్టుగా సమాచారం. అలాగే తన మంత్రి వర్గ సహచరులతో కూడా మాట్లాడినట్టు సమాచారం.

అయితే ఫోన్ టాపింగ్ కేసుతో తమకు సంబంధం లేదని ఇప్పటికే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అధికారులు రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా చేసే కార్యకలాపాలతో తమకు సంబంధం ఏంటని వారు ప్రశ్నించారు.

కానీ బీఆర్ఎస్ పై ఎటాక్ మాత్రం ఆగలేదు. దాదాపు రెండేళ్లుగా మీడియా ట్రయల్ నడుస్తూనే ఉంది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. వారిని హోటల్స్ కి పిలిపించుకున్నారని చాలా మీడియా సంస్థలు ఇష్టారీతిగా వార్తలు రాశాయి.

దీనిపై కేటీఆర్ (KTR)కోర్టును కూడా ఆశ్రయించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న వార్తల్లో నిజం లేదని స్వయంగా విచారణ అధికారులే ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారని.. ది హిందూ దినపత్రిక సంచలన కథనం కూడా రాసింది.

మంత్రి కొండా సురేఖ కూడా సమంత విషయంలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు ఆమె ఆ కేసును ఎదుర్కొంటున్నారు. ఇటు బండి సంజయ్(Bandi sanjay) కి కూడా కేటీఆర్ నోటీసులు పంపించారు.

అయితే.. కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలో భాగంగానే తమపై కేసులు పెడుతున్నారనేది దీని ద్వారా మరోసారి స్పష్టమైందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.

రెండేళ్లుగా రేవంత్ రెడ్డి హైడ్రామా నడిపించారని.. ఇప్పుడు మరో రెండు మూడేళ్లు బీజేపీ హైడ్రామా నడిపిస్తుందని.. బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకే ఇదంతా చేస్తున్నారని వారంటున్నారు.

Read More :