Shivajyothi : తీన్మార్ వార్తలతో అందరికి సుపరిచితమై.. తన టాలెంట్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న సావిత్రి అలియాస్ శివజ్యోతి త్వరలో తల్లికాబోతోంది.
ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో వెల్లడించింది. బేబీ బంప్ తో ఓ వీడియో చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ గా కొన్ని అంశాలను ప్రస్తావించింది.
“అందరికీ దసరా శుభాకాంక్షలు 🌺
ఆ ఏడుకొండల వెంకన్నస్వామి దయతో…🙏🙏
Yessss… మాకు బిడ్డ రాబోతుంది #2026 లో….🥹🧿
మా పిల్లల కోసం ఎంతోమంది ఎంతగానం wait చేసిండ్రో …🥹
మీరు – నాకు కావలిసినవాళ్లు…
వాళ్ల సొంత అక్క బావ కి Baby రావాలి అన్నంత గట్టిగా కోరుకున్నారు 🫂🫂🫂
ఇట్ల Bidda అస్తుంది అని చెప్పగానే
మా వాళ్ళు ఇచ్చిన reaction నా lifeలో ఎప్పటికీ మర్చిపోను❤️🥹🥹

I hope మీరు కూడా అంతే Happy గా feel అయితరు అనుకుంటున్న…
అందుకే చెపుతున్న పండుగ పూట ఈ ముచ్చట 🥰😍😍
Please no distiiiiiiiiiiiiiii 🧿🧿🧿
Only blessingssss🙏🙏🙏
Nazar కన్నా blessing powerful అని prove చేద్దాం 🙌🙌
ఈ Beautiful Journey లో Support చేసినోళ్లను
నా support గా ఉన్నళ్లోను life long మర్చిపోను ❤️
And I promise… I will always be there for you 🙏
And బాధ పెట్టినళ్లోను కుడా మర్చిపోను ..
Thank you మీ love, support and blessings
ఎప్పుడూ ఉండాలి నాకు, మా ఫ్యామిలీకి,
Special గా మా ఈ చిన్న babyకి 🙏🧿❤️”

శివజ్యోతి.. 2014లో వీ6 న్యూస్ లో తీన్మార్ యాంకర్ గా చేరింది. అక్కడ ఆమె పేరును సావిత్రిగా మార్చారు.
అదే ఆమె సొంత పేరుగా మారిపోయింది.
ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఆ సమయంలో వీ6 పెద్దలు ఆమెతో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తర్వాత టీవీ9లోనూ కొద్దిరోజుల పాటు యాంకరింగ్ చేసింది.

సొంతగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి.. రకరకాల అంశాలపై వీడియోలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
అయితే.. పెళ్లై చాలా ఏళ్లవుతున్నా ఇంకా పిల్లలు ఎందుకు లేరు..? అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు.

కెరీర్ పై ఫోకస్ పెట్టడంతో కొద్దిరోజులు పిల్లల విషయంలో గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఎట్టకేలకు ఇప్పుడు శివజ్యోతి తల్లికాబోతున్నట్టు ప్రకటించింది.
..
Read Also :

