Guntur: తురకపాలెం గ్రామంలో గత ఐదు నెలల్లో 28మంది ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై పరిశీలన చేయగా, ఇద్దరికి చేసిన రక్త పరీక్షల్లో “మెలియాయిడోసిస్” అనే అరుదైన ప్రమాదకర వ్యాధి ఉన్నట్లు తేలింది.
బర్కోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సమస్యలు లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
ఈ వ్యాధి వచ్చినప్పుడు జ్వరం తీవ్రమై ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది.
ప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపి గ్రామంలో వైద్య పరీక్షలు జరపాలని, పూర్తివివరాలు రిపోర్ట్‌గా అందించాలని ఆదేశించింది.
Guntur: 5 నెలల్లో 28మంది మృతి

