I Phone 17 : ఐఫోన్ 17 ధరలు.. డిస్కౌంట్లు ఇవే..! త్వరపడండి..!

I Phone 17 models and offers

I Phone 17 : దేశంలో యాపిల్ ఐ ఫోన్ 17 సిరీస్ అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని స్టోర్ల ముందు యూత్ క్యూ కట్టారు. తెల్లవారకముందే చేరుకుని స్టోర్ల ముందు లైన్ లో నిలబడ్డారంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఐఫోన్ 17 నాలుగు మోడల్స్ లో లభిస్తోంది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వేరియంట్లలో దొరుకుతోంది.

i phone 17 pro

కొత్త మోడల్ మార్కెట్ లోకి రావడంతో పలు రిటైల్ స్టోర్లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది. ఎక్సేంజ్ బోనస్ తో పాటు  నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది.

ఐఫోన్ 17 మీద రూ.6000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. అలాగే.. ఐఫోన్ ఎయిర్ మీద రూ. 4000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది.

ఇక క్రోమాలో రూ. 6000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. రూ.12వేల వరకు ఎక్సేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది. యాక్సెసరీస్ మీద 20 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.

విజయ్ సేల్స్ లో కూడా రూ.6000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.

దేశంలో ఐఫోన్ 17 సిరీస్ ధరలు..

iPhone 17 price:

256GB: ₹82,900

512GB: ₹1,02,900

iPhone Air:

256GB: ₹1,19,900

512GB: ₹1,39,900

1TB: ₹1,59,900

iPhone 17 Pro

256GB: ₹1,34,900

512GB: ₹1,54,900

1TB: ₹1,74,900

iPhone 17 Pro Max

256GB: ₹1,49,900

512GB: ₹1,69,900

1TB: ₹1,89,900

2TB: ₹2,29,900