Good Sleep: ప్రస్తుత కాలంలో చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. నిద్ర పట్టాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది.
మరి దీనికి పరిష్కారం ఏంటీ.?
నిద్రలేమి సమస్య నుంచి ఎలా బయటపడాలి.?
ఆహారపు అలవాట్లు మారితే నిద్ర పడుతుందా.? లేకపోతే ఇంకేమైనా చేయాలా అన్న అనుమానాలు చాలామందిని వేధిస్తుంటాయి.
అయితే.. ఆహారం (food)మార్చడం ఒక్కటే నిద్ర సమస్యకు పరిష్కారం కాదు. ఏం తీసుకుంటున్నామో అనే దానితో పాటు.. ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం.
ఆహారం (Food):
చెర్రీ జ్యూస్, కివీ పండ్లు, వెచ్చని పాలు లాంటి కొన్ని ఆహార పదార్థాలు నిద్రపోవడానికి (good sleep) సహాయపడతాయి.
పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ద్వారా శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది “స్లీప్ హార్మోన్” అని కూడా పిలుస్తారు.
గుడ్లు, చేపలు, విత్తనాలు, వేరుశనగలు వంటివి కూడా మెలటోనిన్‌ను అందిస్తాయి.
Read Also :

ఆహార విధానం (Diet / Timing):
రాత్రి ఆలస్యంగా, ఎక్కువగా తినడం నిద్రకు భంగం కలిగిస్తుంది.
కెఫీన్(coffee) , కార్బొనేటెడ్ డ్రింక్స్ (cool drinks) వంటి వాటిని దూరంగా ఉంచితే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
రాత్రి సమయంలో తేలికపాటి, సరైన సమయానికి తిన్న ఆహారం నిద్రకు ఉపయోగపడుతుంది.
అంటే, మనం ఏం తింటామో మాత్రమే కాదు, ఎప్పుడు, ఎంత, ఎలా తింటామో అనేది కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది.
మెలటోనిన్ (melatonin) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
ఎక్కువసేపు నిద్రపోడానికి ఇది సహాయపడుతుంది.
అయితే, ఒకే ఒక్క ఆహారం గానీ ఏదైనా లిక్విడ్ డైట్ గానీ నిద్రకు సరిపోవని కూడా చెబుతున్నాయి.

నిజానికి మన మొత్తం ఆహార పద్ధతి (overall diet) చాలా ముఖ్యం.
కొలంబియా యూనివర్సిటీకి చెందిన నిపుణుల సలహా ప్రకారం.. “రోజంతా తినే ఆహారం పట్ల శ్రద్ధ లేకుండా, రాత్రి పడుకునే ముందు కేవలం ఒక గ్లాస్ చెర్రీ జ్యూస్ తాగితే చాలు అని అనుకోవడం పొరపాటే. శరీరం ఆహారం నుంచి నిద్రకు అవసరమైన న్యూరోకెమికల్స్‌ను వెంటనే కొన్ని గంటల్లో తయారు చేయదు. రోజంతా ఏం తింటామన్నదే చివరికి నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుంది.”
అంటే, నిద్ర కోసం ఒక్క ఆహారం కాదు – మన మొత్తం ఆహార శైలి, రోజువారీ తినే అలవాట్లు కీలకం.
Read Also :

