Beer drinking : సాధారణంగా పార్టీలైనా, వేసవి ఉపశమనమైనా.. చాలా మందికి బీరే మొదటి ఎంపిక. చాలామంది యూత్ బీర్ తాగాడానికి చాలా ఇష్టపడుతుంటారు.కానీ 90 శాతం మందికి బీరు ఎలా తాగాలో తెలియదు. తద్వారా దాని రుచి, అనుభూతి మిస్ అవుతున్నారట.
మద్యం ప్రియులు చేసే చాలా సాధారణ తప్పు ఏమిటంటే దానిని సరిగ్గా తాగకపోవడమే. బీరు తాగడానికి సరైన మార్గం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బీరును ఎప్పుడూ నేరుగా తాగకూడదు. దీనివల్ల బీరు యొక్క సువాసన, రుచిని పూర్తిగా ఆస్వాదించలేము. సరైన గ్లాసులో పోసుకుని తాగాలి.
బీరును అతిగా చల్లగా చేసి తాగడం సరైన పద్ధతి కాదు. అధిక చల్లదనం వల్ల బీరు రుచి పోతుంది.
బీరును గ్లాసులో పోసేటప్పుడు, నురుగు ఉండేలా పోయాలి. నురుగు బీరులోని కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తుంది. దీనివల్ల బీరును తాగినప్పుడు కడుపు ఉబ్బరం తగ్గుతుంది
బీరును ఒకేసారి గటగటా తాగేయకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. , ప్రతి సిప్‌ను నోట్లో కొద్దిసేపు ఉంచి, రుచి, సువాసన, ఆ తర్వాత వచ్చే అనుభూతిని ఆస్వాదించాలి. దీని వల్ల బీర్ రుచి మరింత పెరుగుతుంది.
బీరును దాని పూర్తి రుచి, సువాసనతో ఆస్వాదించాలంటే, పైన చెప్పిన విధంగా సరైన గ్లాసు, ఉష్ణోగ్రత, పోసే పద్ధతిని తప్పక పాటించాలని బీర్ నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే, మీరు ఇప్పటికీ ఆ 90% మందిలోనే ఉన్నట్లు లెక్క.
ఈ సారి బీర్ తాగినప్పుడు ఆ టిప్స్ పాటించి చూడండి. బీర్ రుచిని ఎంజాయ్ చేయండి.
Read Also :

