Rohit Sharma : రోహిత్ శర్మ పని అయిపోయినట్టేనా.. గిల్ కు కెప్టెన్సీ!

Rohit Sharma out from captaincy

Rohit Sharma : ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత్  జట్టును BCCI ప్రకటించింది. ఈనెల 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ-20టీ మ్యాచ్ లు ఆడనుండగా వన్డే జట్టుకు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను నియమించింది.

ప్రస్తుతం వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో శుభ్ మన్ గిల్(shubman gill) కు అవకాశం కల్పించింది. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్  ఆడే జట్టులో రోహిత్ శర్మ, కోహ్లీకి చోటు దక్కింది.

రోహిత్ శర్మను సంప్రదించిన తర్వాతే కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేసినట్లు..చీఫ్  సెలెక్టర్  అజిత్  అగార్కర్ చెప్పాడు. శ్రేయాస్  అయ్యర్ ను వైస్  కెప్టెన్ గా ఎంపిక చేసిన సెలెక్షన్  కమిటీ వికెట్  కీపర్ గా KL రాహుల్ ను ఖరారుచేసింది.

మరో కీపర్ గా ధ్రువ్ జురేల్ ను ఎంపిక చేసింది. అక్షర్  పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్  సుందర్, కుల్దీప్  యాదవ్, హర్షిత్  రాణా, మహ్మద్  సిరాజ్, అర్షదీప్  సింగ్, యశస్వీ జైస్వాల్  వన్డే జట్టులో చోటుదక్కించుకున్నారు.

వన్డేల్లో బూమ్రాకు విశ్రాంతినిచ్చారు. టీ-20 జట్టు కెప్టెన్ గా సూర్య కుమార్  యాదవ్ , వైస్  కెప్టెన్ గా గిల్ కు మరోసారి అవకాశం దక్కింది.

అభిషేక్  శర్మ, తిలక్  వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్  పటేల్ , వరుణ్ చక్రవర్తి, బూమ్రా, అర్షదీప్  సింగ్, కుల్దీప్  యాదవ్, హర్షిత్  రాణా, రింకూ సింగ్ , వాషింగ్టన్  సుందర్ టీ-20 జట్టులో ఉన్నారు. వికెట్  కీపర్లుగా జితేశ్  శర్మ, సంజూ శాంసన్  ఎంపికయ్యారు.

భారత జట్టు కూర్పు యువత, అనుభవం కలయికగా కనిపిస్తోంది. కెప్టెన్సీని మార్చడం ద్వారా సెలెక్టర్లు 2027 ప్రపంచకప్‌ కోసం పటిష్టమైన బృందాన్ని సిద్ధం చేసే లక్ష్యంతో ఉన్నారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా గిల్, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లకు ఇదొక పెద్ద అవకాశం.