CBI : దేశంలో లంచగొండులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులే కాదు.. వారికంటే ఎక్కువగా పై స్థాయిలో ఉన్న అధికారులు ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
వందలు, వేల కోట్లు వెనకేస్తున్నారు. అలాంటి ఓ అధికారి పంజాబ్ లో సీబీఐకి పట్టుబడ్డాడు.

రోపర్ రేంజ్ డీఐజీగా ఉన్న హర్ చరణ్ సింగ్ భుల్లాన్ ను, అతని అనుచరుడిని సీబీఐ అరెస్ట్ చేసింది.
ఓ వ్యాపారి నుండి రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో సీబీఐ (CBI)అతడిని అరెస్ట్ చేసింది. హర్ చరణ్ సింగ్ భుల్లాన్..ఆ వ్యాపారి నుండి పెద్ద ఎత్తున నెలవారి మామూళ్లు తీసుకుంటున్నాడని అధికారులు తెలిపారు. దానికి అదనంగా రూ.8లక్షల రూపాయలు అడగటంతో సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
పంజాబ్ లో డీఐజీ ర్యాంక్ అధికారి హర్ చరణ్ సింగ్ భుల్లార్ ను అరెస్ట్ చేసిన సీబీఐ…
అతని ఇంటి నుండి రూ.5కోట్ల నగదు, కేజిన్నర బంగారు నగలు సీజ్..
ఓ బిజెనెస్ మెన్ ను రూ.8లక్షలు లంచం డిమాండ్ చేసి దొరికిపోయిన అధికారి.. pic.twitter.com/8WUyMX9qDa— PV NEWS (@pvnewstelugu) October 17, 2025
ఆ ఐపీఎస్ అధికారి ఇంటి నుండి.. రూ.5కోట్ల క్యాష్, కేజిన్నర బరువున్న బంగారు నగలు సీజ్ చేశారు. వీటి విలువ రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
అలాగే.. భూముల డాక్యుమెంట్లు,బ్యాంకు లాకర్ల తాళాలు, బెంజ్, ఆడి కార్లు, 22 లగ్జరీ వాచ్ లు, బ్యాంకు లాకర్లు, 40 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
..
Read Also :
- బొడ్డు చూపిస్తూ రెచ్చగొడుతున్న సిరి హన్మంత్
- చంద్రబాబు ఢిల్లీ టూర్ గుట్టు ఇదే..!
- రేవంత్ రెడ్డికి ఏకుకు మేకులా తయారైన రాజ్ గోపాల్ రెడ్డి..!
- Jubileehills Fake votes: జూబ్లీహిల్స్ లో సంచలనం.. భారీగా దొంగ ఓట్లు..!
- బీరు ఎలా పడితే అలా తాగకండి..!
- జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ సర్కారుకు భారీ షాక్.. కీలక నేత గుడ్ బై..!

