Sundarakanda : ప్రభాస్ తొలి చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి మళ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగులో హీరోయిన్‌గా కనిపించిన సినిమా “సుందరకాండ”.
నారా రోహిత్ హీరోగా, వృతి వాఘని మరో కథానాయికగా నటించారు. చాలా కాలం క్రితమే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం, ఇన్నాళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చింది.
మరి కథ ఏంటి? సినిమా హిట్ అయ్యిందా లేదా చూద్దాం.
కథ:సిద్ధార్థ్ (నారా రోహిత్) 30 ఏళ్లు దాటినా పెళ్లి చేయలేదు. స్కూల్‌లో చదివేటప్పుడు తన సీనియర్ వైష్ణవి (శ్రీదేవి)పై ఆకర్షితుడవుతాడు.
ఆమెలో కనిపించిన కొన్ని మంచి లక్షణాలు తన భార్యలో ఉండాలని నిర్ణయం తీసుకుంటాడు. అందుకే పెళ్లి సంబంధాలు వచ్చినా, ప్రతి అమ్మాయిలో ఆ క్వాలిటీస్ లేకపోవడంతో తిరస్కరిస్తూనే ఉంటాడు.
ఒక రోజు ఎయిర్‌పోర్ట్‌లో ఐరా (వృతి వాఘని)ని కలుస్తాడు. ఆమెలో తాను కోరుకున్న లక్షణాలు ఉన్నాయని నమ్మి ఆమెను ప్రేమలో పడేస్తాడు.
కానీ ఈ ప్రేమకథ సాఫల్యం సాధించిందా? ఈ క్రమంలో సిద్ధార్థ్ మళ్లీ వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ.
Read Also :

