Bandla Ganesh : పవన్ కళ్యాణ్ వర్సెస్ బండ్ల గణేష్..?

Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కాంట్రవర్సీకి, సంచలనాలకు కేరాఫ్ గా మారారు. గతంలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుగా ప్రచారం చేశారు. ఫలితాల సమయంలో BRSపై ట్వీట్లతో హల్‌చల్ చేశారు. పవన్ కళ్యాణ్ భక్తుడిగా తెలిసిన ఆయన, తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలు నిర్మించి ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఈవెంట్స్ కి వస్తే.. రచ్చ జరుగుతుందనే ఒపినియన్ క్రియేట్ అయ్యింది.

నచ్చినవారిని ప్రశంసలు కురిపిస్తారు. నచ్చకపోతే బండ్ల గణేష్(Bandla Ganesh) ట్వీట్లతో తూటాలు దించుతారు. గతంలో ‘ఈశ్వరా.. పవనేశ్వరా’ అంటూ ప్రీ-రిలీజ్ స్పీచ్ వైరల్ అయింది. కానీ ఇటీవల పవన్ సినిమాల ఈవెంట్స్‌కు ఆహ్వానం రాకపోవడంతో ఆయన అలిగినట్టుగా కనిపిస్తోంది.

ఆయన చేసిన ట్వీట్ ద్వారా ఇది అర్థమవుతోంది. ‘కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నారో చూడరు. నీవు చేయని వాటినే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తి పరచలేవు’ అంటూ పోస్ట్ చేశారు. పవన్‌ కల్యాణ్ ను (Pawan kalyan)ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

bandla ganesh tweeton pawan kalyan

రీసెంట్ గా ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌కు బండ్ల గణేష్ వచ్చారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఇండస్ట్రీ అంతా మాఫియా అంటూ ఆయన చేసినవ్యాఖ్యలు సంచలనం రేపాయి.

‘ఇండస్ట్రీలో మాఫియా వ్యవస్థలు బ్రతకనివ్వవు. కొంతమందే బాగుంటారు. ఒకరు స్టార్ కమెడియన్ కొడుకు, మెగాస్టార్ బావమరిది, ఐకాన్ స్టార్ తండ్రి.. వాళ్లకి లైఫ్ ఈజీ. మనలాంటి వాళ్లు కష్టంతోనే ముందుకు’ అంటూ అల్లు అరవింద్‌ను టార్గెట్ చేశారు.

ఆడియన్స్ ‘ఓజీ.. ఓజీ’ అని గోల మ చేస్తే, ‘పవన్‌కి కోట్లాది భక్తుల్లో నేనూ ఒకడిని. ఓజీ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’ అని కొంచెం కూల్‌గా కామెంట్ చేశారు.

ఆయన ఇలా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారనే  ఓజీ ప్రీరిలీజ్ కు ఇన్వైట్ చేయలేదని తెలుస్తోంది. ఆ కసిని ఇలా సోషల్ మీడియాలో తీర్చుకున్నాడు.

Read Also :