Love You : కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన కేవలం ఐదు నెలలకే ఓ నవ వధువు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్త, భర్త వేధింపులే తన ఆత్మహత్యకు కారణమని ఆ వివాహిత సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం, తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషకు అదే గ్రామానికి చెందిన ఏనుగుతల ప్రదీప్‌కుమార్‌తో సుమారు ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన తర్వాత ఈ దంపతులు కాకినాడ జిల్లా, తొండంగి మండలం, గోపాలపట్నంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
భర్త ప్రదీప్ తొండంగి మండలంలో ఉన్న దివీస్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే శిరీష వేరొకరితో ఫోన్ లో చాటింగ్ చేస్తోందటూ నెల రోజుల నుంచి భర్త, అత్త తరచూ వేధిస్తున్నారు. దీనిపై తన తండ్రి బుద్ధుడుకి శిరీష ఫోన్ చేసి తనను కొడుతున్నారని, వేధింపులు భరించలేకపోతున్నానని చెబుతూ వాపోయింది శిరీష.
అనంతరం తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అదే రోజు రాత్రి ఆయన గోపాలపట్నం రాగా అప్పటికే ఆమె ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. పక్కనే సూసైడ్ నోట్ రాసి ఉంది. సూసైడ్ నోట్‌లో శిరీష తన ఆత్మహత్యకు అత్త, భర్త వేధింపులే కారణమని స్పష్టంగా పేర్కొంది.
నా చావుకి కారణం అత్త, భర్త వేధింపులే కారణం నిజంగా చెప్తున్న నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనుమానపడినట్టు మా ఇద్దరు మధ్య ఏం లేదు. ప్రదీప్ నిజంగా నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను నేను చేసిన పనికి నీకు నా పైన ఉన్నది కోపం అనుకున్నా కానీ.. ఈ అసహ్యం అని తెలుసు కన్నా.
నా వల్ల ఎలాంటి గొడవలు పడకండి నువ్వు మంచిగా ఉండు, నువ్వు అంటే చాలా ఇష్టం . మిస్ యూ ప్రదీప్, గుడ్ బై అని రాసింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అత్త, భర్తపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన గోపాలపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also :

