వైసీపీ తొలి బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లో తెలుసా..?

వైసీపీ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కావడంతో ఆసక్తి నెలకొంది. రూ.2 లక్షల 27 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వ్యవసాయానికి రూ.28 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.

ఎన్నికల హామీలు, మేనిఫెస్టో అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిసింది. విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పన, సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించనున్నారు.

Read Also : మోజో టీవీ మాజీ CEO అరెస్ట్

నవరత్నాల అమలుకు రూ.70వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ఆదాయం పెంపుపై కసరత్తు ప్రారంభించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. వివిధ మార్గాల ద్వారా రూ.17వేల కోట్ల ఆదాయం దక్కేలా ప్రణాళికలు రచిస్తోంది.

కొత్త పథకాలకు రూ.38,901 కోట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌కు రూ.18వేల కోట్లు, అమ్మ ఒడి రూ.6500 కోట్లు, పేదల గృహ నిర్మాణానికి చేయూత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెళ్లి కానుకలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండనున్నాయి. శాసన మండలిలో పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ కేటాయింపులు ఈ కింద విధంగా ఉండే అవకాశముంది

వ్యవసాయానికి రూ. 28,886 కోట్లతో బడ్జెట్‌ రూపకల్పన
నవరత్నాల అమలుకు బడ్జెల్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ. 18,000 కోట్లు, అమ్మఒడికి రూ. 6,500 కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8,500 కోట్లు
గృహనిర్మానానికి రూ. 8వేల కోట్లు, జలవనరులకు రూ. 12వేల కోట్లు
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 12వేల కోట్లు కేటాయింపు
పాఠశాలలో మౌలిక వసతులకు రూ. రెండువేల కోట్లే
ఆస్పత్రులకు మౌలిక వసతులకు రూ. రెండువేల కోట్లు
పంటల బీమాకు రూ. 2,163 కోట్లు కేటాయింపు అవకాశం
విపత్తుల నిర్వహణ నిధికి రూ. 2వేల కోట్లు కేటాయించే అవకాశం
ధరల స్థిరీకరణ నిధి రూ. 3లే కోట్లు, విద్యుత్‌ రాయితీకి రూ. 5వేల కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ. 1150 కోట్లు కేటాయింపులు చేసే అవకాశం