home page

బుర్కా బంద్.. మదర్సాలు క్లోజ్.. ఆ సర్కారు కీలక నిర్ణయం

 | 
బుర్కా బంద్.. మదర్సాలు క్లోజ్.. ఆ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులు ముసుగులో వచ్చి వందలాది మంది ప్రాణాలు తీస్తున్నారు. బాంబులు పెట్టి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వరుస ఘటనలతో విసిగిపోయిన ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ముసుగు ప్రమాదాల నుంచి బయటపడేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక స్టెప్ తీసుకుంది. దేశంలో బుర్కాలు బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటించింది.

దీనిపై చట్టం చేసేందుకు రెడీ అయ్యింది. డ్రాఫ్ట్ కు త్వరలోనే ఆమోదం లభిస్తుందని.. అమలులోకి వస్తుంది శ్రీలంక మంత్రి వీరశేఖర తెలిపారు. దేశ భద్రత కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

గతంలో తమ దేశంలోని ముస్లిం మహిళలు, యువతులు బుర్కాలు వేసుకునేవారు కాదన్నారు. కొన్నేళ్ల క్రితమే బుర్కా సాంప్రదాయం మొదలైందన్నారు. మత ఛాందసవాదం పెరిగిపోవడంతో బుర్కాలు వేసుకోవడం మొదలైందన్నారు.

మత ఛాందసవాదాన్ని తాము ఎంతమాత్రం సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పూర్తిగా ముఖం కనబడకుండా కవర్ చేసుకోవడాన్ని అనుమతించబోమన్నారు.

అంతేకాదు.. శ్రీలంకలో మదర్సాలను కూడా మూసేస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో ఇష్టారాజ్యంగా స్కూళ్లు పెట్టి.. ఏది పడితే అది చెబుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

- పవన్ ఒళ్ళో పాప....ఇప్పుడు హీరోయిన్.. ఎవరి కూతురో తెలుసా?