home page

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి ధరలు!

 | 
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి ధరలు!

Gold And Silver Rates Today : బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. అటు వెండి ధరలు పెరిగాయి.. దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,930 రూపాయలుగా ఉంది.

ఇక దేశంలోని ముఖ్య పట్టణాల్లో బంగారం ధరలను ఓ సారి పరిశీలిద్దాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర 51,930 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,000 రూపాయలుగా ఉంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంధర 49,210 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52,680 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,750 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,950 రూపాయలుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,930 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 51,930 రూపాయలుగా ఉంది.

ఇక వెండి ధరల విషయానికొస్తే.. కిలో వెండి (Gold and silver rates today) 66,500 రూపాయలు పలుకుతోంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన పట్టణాలన్నింటిలోనూ కేజి వెండి 66,500 రూపాయలుగానే ఉంది.